సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ ఫైట్ మాస్టర్ కన్నుమూత!

ఈ ఏడాది సినీ పరిశ్రమ చాలా మంది ప్రముఖులను కోల్పోయింది. తారక రత్న, కె.విశ్వనాథ్, శరత్ బాబు, చంద్రమోహన్ వంటి దిగ్గజాలు ఈ ఏడాది కన్నుమూశారు. ఇంకా అనేక మంది నటీనటులు, టెక్నీషియన్స్ మరణించారు. ఒక్క తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా.. పక్క రాష్ట్రాల్లోని సినీ ప్రముఖులు సైతం మరణించడం జరిగింది. అలాగే సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీల కుటుంబాల్లో కూడా విషాదాలు చోటు చేసుకోవడం చూశాం. హీరో విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు సూసైడ్ చేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఇంకో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. ఓ ఫైట్ మాస్టర్ ఈరోజు ప్రాణాలు విడిచారు. దీంతో సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నట్టు అయ్యింది. వివరాల్లోకి వెళితే.. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ఫైట్ మాస్టర్ జాలీ బాస్టియన్ ఈరోజు కన్నుమూశారు. బెంగళూరులోని ఈయన నివాసంలోనే ప్రాణాలు విడిచినట్టు తెలుస్తుంది. సడన్ గా గుండెపోటు రావడం వల్ల జాలీ కన్నుమూశారట. దీంతో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

జాలీ బాస్టియన్ 900 కి పైగా సినిమాలకి ఫైట్ మాస్టర్ గా పనిచేశారు. తెలుగులో ఈయన ‘అన్నయ్య’ ‘నక్షత్రం’ వంటి సినిమాలకి ఫైట్ మాస్టర్ గా చేశారు. రిస్కీ షాట్స్ డిజైన్ చేయడంలో.. అవి సక్సెస్ ఫుల్ గా డెలివరీ చేయడంలో ఈయన సిద్ధహస్తుడు అని తెలుస్తుంది. కానీ ఎందుకో తెలుగులో మాత్రం ఈయన ఎక్కువ సినిమాలకి పనిచేయలేదు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus