నందమూరి బాలకృష్ణ అంటే వీర మాస్, ఊర మాస్ అని చెప్పొచ్చు. సినిమా ఎలాంటిదైనా, కంటెంట్ ఏమైనా ఆయన స్టైల్ మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. అందులో ఒక అంశం ఫైట్స్. బాలయ్య సినిమాల్లో ఫైట్స్ చూస్తే ఎవరైనా ఈ మాట చెప్పేస్తారు. తాజాగా ఆయన నుండి సిద్ధమైన చిత్రం నేలకొండ ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం దసరా సందర్భంగా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
ఈ నేపథ్యంలో ఆ సినిమా ఫైట్ మాస్టర్ వెంకట్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘భగవంత్ కేసరి’ సినిమా కోసం ‘‘హాలీవుడ్ స్టైల్ పోరాటాల్ని డిజైన్ చేశామని సినిమా మీద ఉన్న హైప్‌ను మరింత పెంచేశారు. బాలకృష్ణ ఫైట్స్ చేసిన విధానం, వేగం సినిమాకి ప్రత్యేకతను తీసుకొస్తాయని చెప్పుకొచ్చారు ఫైట్ మాస్టర్ వెంకట్. ఇప్పటికే బాలకృష్ణతో కొన్ని సినిమాలు చేసిన వెంకట్… ‘భగవంత్ కేసరి’లో వైవిధ్యమైన ఫైట్స్‌ను రూపొందించారు.
కథ ప్రకారం చూస్తే… సినిమాలో ఫస్ట్ హాఫ్ ఫైట్స్ ఒకలా, సెకండాఫ్ ఫైట్స్ మరోలా ఉంటాయట. అలా ఎందుకు అనేది సినిమా చూస్తేనే తెలుస్తుందట. కథ నైజం రీత్యా యాక్షన్ సన్నివేశాలు సహజంగా ఉండాలని ముందుగానే అనుకున్నారట. అలాగే బాలకృష్ణ ఇదివరకటి సినిమాల్లో మాదిరిగా ఈ సినిమాల్లో మనుషులు గాల్లో ఎగిరిపడరు అంటూ కాస్త కాంట్రవర్శియల్ కామెంట్స్ చేశారు వెంకట్. ఎక్కువ కట్స్, స్లో మోషన్ షాట్స్ లాంటివి లేకుండా హాలీవుడ్ తరహాలో సహజంగా ఫైట్స్ రూపొందించామని చెప్పుకొచ్చారు.
‘పైసా వసూల్’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలక పని చేసిన అనుభవం ఇప్పుడు (Bhagavanth Kesari) ‘భగవంత్ కేసరి’ సినిమాకి పనికొచ్చింది అని కూడా చెప్పారు. అయితే వెంకట్ మాస్టర్ చెప్పిన ‘మనుషులు గాల్లోకి ఎగరడం’ అనే కాన్సెప్ట్ రామ్ లక్ష్మణ్ మాస్టర్‌ల ఫైట్స్ కంపోజిషన్‌లో కనిపిస్తూ ఉంటుంది. దీంతో వాళ్లకు ఇదేమైనా కౌంటరా అనే డౌటానుమానం రాకమానదు. మరి దీనికి క్లారిటీ ఎవరిస్తారో చూడాలి.
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు