‘రిపబ్లిక్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సినీ, రాజకీయ అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీశాయి. ఏపీ గవర్నమెంట్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి నష్టం కలిగిస్తుందంటూ ఆయన ఇచ్చిన స్పీచ్ దుమారం రేపింది. ఆదివారం ఉదయం నుంచి ఏపీ మంత్రులు, వైకాపా నాయకులు పవన్ వ్యాఖ్యల పట్ల తీవ్రంగా మండిపడుతున్నారు.
ఈ క్రమంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటన విడుదల చేసింది. సినిమా ఇండస్ట్రీ మనుగడ సాగించాలంటే రెండు ప్రభుత్వాల మద్దతు అవసరమని చెప్పుకొచ్చింది. వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను తమకు సంబంధం లేదని చెప్పింది. సినీ పరిశ్రమపై ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుందని.. వ్యక్తిగత అభిప్రాయాలను వివిధ వేదికలపై చెబుతున్నారని.. వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని వేల కుటుంబాలు బతుకుతున్నాయని ప్రకటనలో రాసుకొచ్చింది.
కరోనా మహమ్మారి సహా చాలా అంశాలపై తెలుగు సినీ పరిశ్రమ ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించింది.. సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి పేర్ని నానితో చర్చించామని తెలిపింది. ముఖ్యమంత్రి జగన్ సినీ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారని.. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ఇద్దరు ముఖ్యమంత్రులు సినీ పరిశ్రమను కాపాడేందుకు ఎప్పటికప్పుడు మద్దతు ఇస్తూనే ఉన్నారని.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సినీ పరిశ్రమకు ఇరు రాష్ట్రాల సీఎంల మద్దతు ఇలాగే కొనసాగాలని ప్రకటనలో రాసుకొచ్చింది.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!