Anasuya: పుష్ప 2 సెట్స్ లో ఆ అమ్మాయి టాలెంట్ చూసాను.. ఆమె ఖచ్చితంగా నిలదొక్కుకుంటుంది.!

జానీ మాస్టర్ (Jani Master)  కారణంగా మానసికంగా, శారీరికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న 21 ఏళ్ల లేదీ కొరియోగ్రాఫర్ విషయంలో ఇప్పుడిప్పుడు ఇండస్ట్రీ వర్గాలు చొరవ చూపిస్తున్నారు. ఆల్రెడీ మా అసోసియేషన్ & తెలుగు ఫిలిం ఛాంబర్ లు సంయుక్తంగా ఈ కేస్ ను లీగల్ గా హ్యాండిల్ చేస్తుండగా, మరోవైపు ఆమెకు ఇండస్ట్రీ వర్గాల నుండి కూడా సపోర్ట్ పెరుగుతోంది. ఆల్రెడీ ఆమెకు ఓ పెద్ద హీరో తన ప్రతి సినిమా, అలాగే తన బ్యానర్ నుండి వచ్చే ప్రతి సినిమాలోనూ కచ్చితంగా వర్క్ ఇస్తాను అని చెప్పినట్లుగా ఝాన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Anasuya

తాజాగా ఈ జాబితాలోకి అనసూయ (Anasuya) కూడా చేరింది. ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సదరు బాధిత లేడీ కొరియోగ్రాఫర్ ను తాను “పుష్ప 2” (Pushpa 2) సెట్స్ లో కలిసానని, ఆమె చాలా టాలెంటెడ్ అని పేర్కొంటూ.. ఆమె విషయంలో ఇదంతా జరగడం చాలా బాధాకరమని, అయితే ఫిలిం ఛాంబర్ ఈ విషయంలో వ్యవహరిస్తున్న తీరుకు అభినందనలు తెలిపింది. ఇలా ఇండస్ట్రీ నుండి ఒక్కొక్కరుగా బాధితురాలికి సపోర్ట్ గా నిలవడం అనేది మెచ్చుకోవాల్సిన విషయం. ఈ జాబితాలో మరింత మంది ముందుకు వస్తే బాగుంటుంది.

అయితే.. ఈ విషయంలో నిజానిజాలను త్వరగా నిర్ధారించి, నిందితుడిని త్వరగా శిక్షించి, ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై పర్యవసానాలను ఇంకాస్త కఠినతరం చేస్తే.. భవిష్యత్ లో ఈ పని చేయాలన్న ఆలోచన కూడా ఎవరికీ రాదు. మరి మన ఇండస్ట్రీ పెద్దలు ఈ విషయంలో ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి. ఎందుకంటే.. నిజ నిర్ధారణ జరిగే వరకు వాళ్లు మాట్లాడడం సమంజసం కాదు కాబట్టి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. ఒకవేళ ప్రూవ్ అయితే గనుక వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఈ విషయాన్ని అడ్రెస్ చేయడం ఉత్తమం!

 ఇక జానీ కెరీర్ అయిపోయినట్లే.. బయటపడే ఛాన్సే లేదు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus