నందమూరి బాలకృష్ణ ‘లెజెండ్’ తర్వాత సరైన హిట్టు అందుకోలేకపోయారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ‘జై సింహా’ వంటి చిత్రాలు పర్వాలేదనిపించాయి కానీ బాలయ్య ఫ్యాన్స్ కు కావాల్సిన విజయాన్ని అవి సాధించలేకపోయాయి.ఇక వాటి తర్వాత ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ‘రూలర్’ వంటి చిత్రాలు ఘోరంగా నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో బోయపాటితో చెయ్యి కలిపి ‘అఖండ’ మూవీ చేసాడు బాలయ్య.ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.
బాలయ్య అభిమానులంతా థియేటర్ల వద్ద పండగ చేసుకుంటున్నారు. ఇంత ఆనందకరమైన సమయంలో ఓ ఎగ్జిబ్యూటర్ కమ్ బాలయ్య అభిమాని హఠాన్మరణం చెందడం అందరినీ విషాదంలోకి నెట్టేసింది.అది కూడా ‘అఖండ’ సినిమా చూస్తూనే అతను మరణించడం విచారించదగ్గ విషయం. పూర్తి వివరాల్లోకి వెళితే… తూర్పుగోదావరి జిల్లా సినీ ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రముఖ సినీ ఎగ్జిబిటర్ అయిన జాస్తి రామకృష్ణ శ్యామల థియేటర్‌లో ‘అఖండ’ సినిమా వీక్షిస్తుండగానే బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యి ప్రాణాలు విడిచారు.
ఈ క్రమంలో ధియేటర్ యాజమాన్యం వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. రాజమండ్రి సమీపంలో ఉన్న నామవరం వీఎస్ మహల్ థియేటర్ ఓనర్ గా కెరీర్ ను ప్రారంభించి అటు తర్వా జిల్లా సినీ ఎగ్జిబ్యూటర్స్ అసో సియేషన్ అధ్యక్షుడిగా, వింటేజ్ క్రియేషన్స్ అధినేతగా ఎదిగారు రామకృష్ణ.అక్కడ పాపులర్ జెకె రెస్టారెంట్ కు అధినేత కూడా ఈయనే.రామకృష్ణ భార్య పేరు శిరీష. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!