తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని ఒకే చేసిన కాజల్!

కాజల్ పెళ్లి గురించి వాళ్ళ ఇంట్లో కూడా ఇన్నిసార్లు ఆలోచించి ఉండరు. తనకంటే చిన్నదైన చెల్లెలికి పెళ్లి చేసి, ఆమె కొడుకుతో ఆడుకొంటున్న కాజల్ ను చూసి ఆమె కుటుంబ సభ్యులు కూడా సంతోషంగానే ఉన్నారు. కానీ.. ఆమె పెళ్లి గురించి గాసిప్పు రాయుళ్ళు మాత్రం తెగ ఆలోచించేస్తున్నారు. ప్రతి ఏడాది “ఈ ఏడాది కాజల్ పెళ్లి” అని ఒకటికి పదిసార్లు వార్తలు రావడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే.. వాళ్లందరి కోరిక ఈసారి నెరవేరనుంది. నిజంగానే కాజల్ వచ్చే ఏడాది పెళ్లి పీటలెక్కనుంది. వరుడ్ని కన్ఫర్మ్ చేసింది ఆమె కుటుంబ సభ్యులే.

నార్త్ కి చెందిన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకుతో కాజల్ పెళ్లి ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈమధ్యకాలంలో సరైన హిట్ లేకపోవడమే కాక.. మంచి ఆఫర్లు కూడా లేకుండా ఉన్న కాజల్ కి పోటీగా బోలెడుమంది హీరోయిన్లు వచ్చేశారు. నిజానికి “సర్దార్ గబ్బర్ సింగ్”కి ముందే ఆమె పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతుందని టాక్ వచ్చింది. కానీ.. ఆ సినిమా ఫ్లాప్ అయినా కాజల్ మాత్రం బౌన్స్ బ్యాక్ అయ్యింది. ఏకంగా మూడేళ్లు వరుస ఆఫర్లతో బిజీ అయిపోయింది. ఇప్పుడు కాజల్ కి 34 ఏళ్ళు.. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అని భావించి ఈ నిర్ణయం తీసుకొంది. ఆ పెళ్లి చేసుకోబోయేవాడు ఎవరు అనేది త్వరలోనే తెలుస్తుంది.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus