ఎట్టకేలకు మెగాస్టార్ ఆశ నెరవేరబోతోంది…?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా నరసింహ రెడ్డి’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయ్యింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉండగా మెగాస్టార్ ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రం రీ ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే… ఆయనతో తన బ్యానర్లో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తానని అల్లు అరవింద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి 151 వ చిత్రాన్ని కూడా చరణ్ నిర్మిస్తుండడంతో…. అల్లు అరవింద్ బ్యానర్లో చిరు సినిమా ఉండదేమో అని అందరూ అనుకున్నారు.

అయితే ఈ ప్రాజెక్టు కచ్చితంగా ఉండబోతుందని తాజా సమాచారం. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడట. తెలుగు .. తమిళ భాషల్లో రూపొందే ఒక సినిమా కోసం కథను సిద్ధం చేయమని అల్లు అరవింద్ .. శంకర్ కి చెప్పారట. తెలుగులో చిరంజీవి హీరోకాగా.. తమిళంలో అజిత్ తో లేదా .. విజయ్ తో గాని ఈ ప్రాజెక్టు చేసేలా మాటలు జరిగాయట. అయితే శంకర్ ప్రస్తుతం కమల్ తో ‘భారతీయుడు2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక మెగాస్టార్ కూడా ‘సైరా’ పూర్తయ్యాక కొరటాల .. త్రివిక్రమ్ లతో వరుసగా సినిమాలు చేస్తారు. ఇక ఇవి పూర్తవ్వగానే శంకర్ డైరెక్షన్లో సినిమా ఉండే అవకాశం ఉందట. అసలే మెగాస్టార్ కి శంకర్ డైరెక్షన్లో చేయాలని ‘జెంటిల్మేన్’ చిత్రం నుండీ చాలా ఆశని… ‘రోబో’ ఆడియో వేడుకలో స్వయంగా ఆయనే చెప్పిన సంగతి తెలిసిందే. ఏదేమైనా మెగాస్టార్ చిరంజీవి కోరిక త్వరలోనే తీరబోతుందని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus