ఎట్టకేలకు పాయల్ క్లారిటీ ఇచ్చింది

‘ఆర్.ఎక్స్.100’ చిత్రంలో ఓ రేంజ్ గ్లామర్ షో చేసి కుర్రకారుని కట్టిపడేసింది పాయల్ రాజ్ పుత్. ఈ చిత్రంతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ పోషించిన పాయల్ ఆ పాత్రకి వందకు వంద శాతం న్యాయం చేసిందనే చెప్పాలి. ఈ చిత్రం సక్సెస్ తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. అయితే అన్నీ గ్లామర్ షో చేసే పాత్రలే వస్తుండడంతో… వాటిని పక్కన పెట్టి, తన పాత్రకి ప్రాధాన్యత ఉండే పాత్రల్ని మాత్రమే ఎంచుకుంటుంది. ప్ర‌స్తుతం పాయల్ ‘వెంకీమామ‌’ చిత్రంలో వెంక‌టేష్‌ సరసన నటిస్తుంది. దీంతో పాటూ రవితేజ సరసన ‘డిస్కోరాజా’ చిత్రంలో కూడా నటిస్తుంది.

వీటితో ‘ఆర్.డి.ఎక్స్’ అనే ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో కూడా న‌టిస్తుంది. భాను శంక‌ర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సి.క‌ల్యాణ్ నిర్మిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. అయితే ఈ చిత్రం పాయ‌ల్ మొదటి చిత్రమైన ‘ఆర్.ఎక్స్.100’ కు సీక్వెల్ అంటూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. ‘ఆర్.డి.ఎక్స్’ టైటిల్ ‘ఆర్.ఎక్స్.100’ కు దగ్గరగా ఉండడంతో ఈ చిత్రం ‘ఆర్.ఎక్స్.100’ కు సీక్వెల్ అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం పై పాయ‌ల్ క్లారిటీ ఇచ్చింది. ‘ ‘ఆర్.ఎక్స్.100’ చిత్రానికి ‘ఆర్.డి.ఎక్స్’ సీక్వెల్ కాదు.. ఇది డిఫ‌రెంట్ జోన‌ర్ మూవీ’ అంటూ తెలిపింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus