మెగా అభిమానులు అంతా ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’. ‘బాహుబలి’ వంటి భారీ చిత్రం మా హీరోలకు ఎప్పుడు దొరుకుతుందా అని అనుకున్న సమయంలో వారికి సమాధానంగా దొరికింది ‘సైరా’ చిత్రం. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఖర్చు కి ఏమాత్రం వెనుకాడకుండా రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇప్పటి వరకూ ఈ చిత్రానికి 250 కోట్ల బడ్జెట్ అయినట్టు ప్రచారం జరిగింది. అయితే లెక్క ఇంకా పెద్దదని తెలుస్తుంది.
అందుతున్న తాజా సమాచారం ప్రకారం ‘సైరా’ కు 285 కోట్ల బడ్జెట్ అయ్యిందట. ఏదో లాభాలు కోసం అని కాదు… అభిమానులకి.. ప్రేక్షకులకి ఓ కొత్త అనుభూతి ఇవ్వాలని.. దర్శకుడు సురేందర్ రెడ్డి అడిగిన ప్యాలెస్ లు, కోటలు ఏర్పాటు చేశాడు చరణ్. అంతే కాదు తెలుగు, తమిళ, హిందీ , కన్నడ భాషల్లోని స్టార్ లను ఎంచుకున్నారు. టెక్నిషియన్ల విషయంలో కూడా రాజీ పడలేదు. ఇక జార్జియా దేశంలో తెరకెక్కించిన ఓ యాక్షన్ సీక్వెన్స్ కే 75 కోట్ల వరకూ ఖర్చు చేసారట. ఇక సొంత బ్యానర్ కాబట్టి మెగాస్టార్ చిరంజీవి రేమ్యూనరేషన్ తీసుకోలేదని తెలుస్తుంది. మరి ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అవుతుందో తెలియాలంటే అక్టోబర్ 2 వరకూ ఆగాల్సిందే..!