మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మెగా కాంపౌండ్ లోనే ఎక్కువగా సినిమాలు తీశారు. ఇప్పటివరకు నందమూరి కోటలకి అడుగు పెట్టలేదు. అతని డైరక్షన్లో నటించాలని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఎప్పటినుంచో ఆశ ఉంది. త్రివిక్రమ్ కి ఉన్న కమిట్ మెంట్ వల్ల తారక్ తో సినిమా చేయలేక పోయారు. ఇద్దరూ కలుసుకున్నప్పుడల్లా తొందర్లోనే మంచి మూవీ ప్లాన్ చేద్దామని అనుకునేవారు.
ఆ సమయం రానే వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్న మాటల మాంత్రికుడుకి ఆయన గట్టి షాక్ ఇచ్చారని, దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందని వార్తలు ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇదే అదనుగా త్రివిక్రమ్ తో తన సినిమా ఒకే చేయించేందుకు తారక పావులు కదుపుతున్నట్లు తెలిసింది. ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ తీసిన మైత్రి మూవీ మేకర్స్ వారు డైరక్టర్ తో సంప్రదింపులకు సిద్ధమై పోయారు.
త్రివిక్రమ్ కి స్నేహితుడు, అ..ఆ సినిమా నిర్మించిన రాధా కృష్ణ కూడా హీరోగా ఎన్టీఆర్ అయినా పరవాలేదు డబ్బులు ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉన్నారని సమాచారం. ఇప్పుడు బాల్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కోర్టులో ఉంది. పవన్ కోసం ఎదురుచూస్తారా? ఎన్టీఆర్ తో సినిమా ప్లాన్ చేస్తారా? అనేది కొన్ని రోజుల్లో తెలియనుంది.