విష్ణు విశాల్ హీరోగా గౌతమ్ మేనన్ కీలక పాత్రలో మను ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్..ఐ.ఆర్’. హీరో విష్ణు విశాల్ తన సొంత బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి తెలుగులో రవితేజ సమర్పకులుగా వ్యవహరించగా అభిషేక్ పిక్చర్స్ వారు రిలీజ్ చేయడం జరిగింది.ఫిబ్రవరి 11న విడుదలైన ఈ చిత్రానికి క్రిటిక్స్ నుండీ మంచి రెస్పాన్స్ లభించింది. అయితే అనుకోకుండా ఈ మూవీ వివాదంలో కూడా చిక్కుకోవడం జరిగింది.
ఈ సినిమా పై కొందరు వ్యక్తం చేస్తున్న వ్యతిరేకతని చిత్రబృందం ఖండించింది.ముస్లిం మనోభావాలు దెబ్బతినేలా ఈ చిత్రం ఉందని పలు చోట్ల ఈ చిత్రం ప్రదర్శింపబడుతున్న థియేటర్లను నిలిపివేయడం జరిగింది. అందుకే చిత్ర బృందం నేరుగా అందరికీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. “మా ‘ఎఫ్..ఐ.ఆర్’ చిత్రాన్ని ఏ మతస్థులను కించపరిచేలా తీయలేదు. ప్రతి భారతీయుడు గర్వపడేలా తీసిన సినిమా ఇది. అయితే ముస్లిం మనోభావాలను కించపరిచేలా, దెబ్బతినేలా ఉందని కొందరు నిరసన వ్యక్తం చేస్తూ కొన్ని ప్రాంతాల్లో థియేటర్లలో సినిమాను ఆపేయడం జరిగిన సంగతి తెలిసిందే.
కానీ మా చిత్రాన్ని వీక్షించిన ప్రముఖులు కానీ, ప్రేక్షకులు కానీ ముస్లిం మనోభావాలను దెబ్బతినేలా ఏమీ లేదని అభిప్రాయం వ్యక్తం చేసారు. కేరళలో జరిగిన వాస్తవిక సంఘటన ఆధారంగా తీసిన చిత్రమిది.మీకు పొరపాటున అలా అనిపిస్తే మా తరఫున ముస్లిం సోదరులకు క్షమాపణ తెలియజేస్తున్నాము.దయచేసి ఈ విషయాన్ని కాంట్రవర్సీ చేయకుండా సినిమాని సినిమాగా చూడాల్సిందిగా ప్రార్ధన” అంటూ వారు చెప్పుకొచ్చారు. ఇక ‘ఎఫ్.ఐ.ఆర్’ చిత్రానికి అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే.