సూపర్ స్టార్ కొత్త చిత్రం షూటింగ్ వద్ద మంటలు

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త చిత్రం షూటింగ్ లొకేషన్లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ మూడో షెడ్యూల్ ఈ రోజు పునః ప్రారంభయింది. ఫిల్మ్ నగర్ లోని దేవయ్యకుంట చెరువు వద్ద చిత్రీకరణలో నిమగ్నమయిన మురుగదాస్ బృందానికి లొకేషన్లో ఉన్నట్టుండి వచ్చిన మంటలు ఆందోళన కలిగించాయి.

అక్కడ వేసిన టెంటు వద్ద మంటలు రావడంతో  వారికి కాసేపు ఏమి చేయాలో అర్ధం కాలేదు. సూపర్ స్టార్, డైరక్టర్ తోపాటు అందరూ సురక్షితమయిన ప్రాంతానికి వెళ్లి ఫెయిర్ స్టేషన్ కి ఫోన్ చేశారు. వెంటనే ప్రమాద సంఘటనకు చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీపావళి సందర్బంగా యువకులు వదిలిన రాకెట్ టెంట్ పై పడడమే అగ్ని ప్రమాదానికి కారణమని తెలిసింది. మంటలు ఆర్పిన తర్వాత షూటింగ్ యధావిధిగా కొనసాగింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus