సినీరంగం చాలా విచిత్రమైనది. ఒక్కోసారి ఎవరో చేయవలసిన సినిమాలు.. మరెవరో చేస్తూ ఉంటారు. హిట్ అయితే అయ్యో అని.. ఫ్లాప్ అయితే హమ్మయ్య అని మొదటగా ఆఫర్ వెళ్లినవాళ్లు అనుకుంటూ వుంటారు. ఇప్పుడు ఈ మ్యాటర్ ఎందుకు చెబుతున్నానంటే.. రీసెంట్ గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన కవచం సినిమా ఘోర పరాజయం పాలైంది.
నిజానికి ఈ సినిమా కథ ముందు విన్నది నందమూరి కల్యాణ్ రామ్.. అయితే అంతకు ముందే పటాస్ లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించడంతో జనాలకు ఎక్కదని కల్యాణ్ రామ్ భావించాడు. అందువల్ల ఈ కథను ఆయన సున్నితంగా తిరస్కరించాడట. దీంతో స్టోరీ బెల్లంకొండ కాంపౌండ్ కు వచ్చింది. మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న శ్రీనివాస్ పోలీస్ రోల్ కావడంతో కాదనకుండా వెంటనే అంగీకరించేశాడట. కానీ కథలో చెప్పిన దానిని స్క్రీన్ పై సరిగా ప్రొజెక్ట్ చేయలేకపోవడంతో కవచం…జనానికి కల్లోలాన్ని మిగిల్చింది.