ఉగాదికి విడుదల కానున్న మహేష్, నాగ చైతన్య సినిమాల ఫస్ట్ లుక్
- March 24, 2017 / 09:09 AM ISTByFilmy Focus
తెలుగు వారికి తొలి పండుగ ఉగాది. ఈ తెలుగు సంవత్సరాదిని ఘట్టమనేని, అక్కినేని అభిమానులు మరింత గ్రాండ్ గా జరుపుకోనున్నారు. బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ బాబు, మురుగదాస్ దర్శకత్వంలో ద్వి భాష చిత్రం చేస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఉగాదికి వస్తుందని స్వయంగా మహేష్ బాబు మీడియాకి చెప్పారు. ఇక అక్కినేని నాగచైతన్య ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫేమ్ కళ్యాణ కృష్ణ డైరక్షన్లో ఓ కుటుంబ కథ చిత్రం చేస్తున్నారు.
ఈ సినిమాకి ‘రారండోయ్ వేడుక చూద్దాం’ అనే టైటిల్ ని ఖరారు చేశారని తెలిసింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఉగాదికి విడుదల చేయనున్నారు. ఈ రెండు సినిమాలకు చెందిన పేర్లు ఇప్పటి వరకు అధికారికంగా చిత్ర బృందాలు బయటికి చెప్పలేదు. అందుకే వీటి ఫస్ట్ లుక్స్ పై మరింత క్రేజ్ ఏర్పడింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















