కరోనా వైరస్ వాక్సిన్ పై ప్రశాంత్ వర్మ మూవీ

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మొదటి నుండి భిన్నమైన బాట ఎంచుకున్నారు. లేటైనా పర్లేదు కొత్త సబ్జక్ట్స్ తోనే చిత్రాలు తీయాలని నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగానే తన సబ్జక్ట్స్ ఎంచుకుంటున్నారు. ఆయన మొదటి చిత్రం ‘అ’ సైకలాజికల్ థ్రిల్లర్ గా విడుదలైంది. కాజల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ కాన్సెప్ట్ పరంగా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా మేకప్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ విభాగాలలో జాతీయ అవార్డు గెలుపొందింది.

ఆయన రెండవ మూవీ కల్కి క్రైమ్ థ్రిల్లర్ గా విడుదలైంది. రాజశేఖర్ హీరోగా వచ్చిన ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. కాగా నేడు ప్రశాంత్ వర్మ తన మూడవ ప్రాజెక్ట్ పై హింట్ ఇచ్చారు. తన ఈ లేటెస్ట్ మూవీ కరోనా వైరస్ వాక్సిన్ పై ఉంటుందని అర్థం అవుతుంది. గతంలోనే ప్రశాంత్ వర్మ కరోనా వైరస్ పై మూవీ చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఐతే రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే కరోనా వైరస్ పై మూవీ తీశారు.

ఈ చిత్ర ట్రైలర్ కూడా ఆయన విడుదల చేయడం జరిగింది. ఒక ఇంటిలో కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన భీతి, భయం అనే అంశాలతో వర్మ ఈ మూవీ తెరకెక్కించినట్లు ఉన్నాడు. వర్మ వైరస్ పైన తీస్తే ప్రశాంత్ వర్మ వైరస్ వాక్సిన్ పై తీయడం గమనార్హం. ఈ మూవీ ఫస్ట్ లుక్ లోనే చిత్ర క్లైమాక్స్ పై హింట్ ఉంటుందట. మరి రేపు రాబోయే ప్రీ లుక్ లో ప్రశాంత్ వర్మ ఏమి చూపించనున్నాడో.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus