టాలీవుడ్ సినిమా పరిశ్రమ కొత్తవారికి ఎప్పుడు స్వాగతం పలుకుతూ ఉంటుంది. “ఏ స్టార్ ఈజ్ బార్న్” టైటిల్ మార్చి ఇప్పుడు “మ్యానిప్యూలేటర్” గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మ్యానిప్యూలేటర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ దర్శకులు బి.గోపాల్ ఆవిష్కరించారు. వీజే సాగర్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమాకు సి.రవి సాగర్ & వి జె సాగర్ నిర్మాణ సారథ్యంలో సి ఆర్ ప్రొడక్షన్స్, వి జె ఫిల్మ్ ఫ్యాక్టరీ నుంచి తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా కళ్యాణ్, ప్రియా పాల్, సోఫియా ఖాన్, ఊహ రెడ్డి లను తెలుగు తెరకు పరిచయం చేస్తూన్నారు. క్యారేక్టర్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ తో పక్కా కల్ట్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాగా “మ్యానిప్యూలేటర్” రాబోతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ… “మ్యానిప్యూలేటర్ టైటిల్ యువతకు కనెక్ట్ అయ్యే లా ఉందని అన్నారు, ఈ సినిమా విజయం సాధించి చిత్ర యూనిట్ సభ్యులందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను , ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాల వైపే ప్రేక్షకులు మొగ్గు చూపిస్తున్నారు, ఈ మ్యానిప్యూలేటర్
సినిమా కూడా అదే వరుసలో ఉంటుందని” అన్నారు.
ఈ సినిమాలో దర్శకుడు విజె సాగర్
43 మంది కొత్త నటీనటులు పరిచయం చేయడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మొత్తం 5 డిఫరెంట్ సాంగ్స్ ఉన్నాయి, తనికెళ్ళ శంకర్, వరికుప్పల యాదగిరి, విశ్వనాథ్ ఈ సినిమా కోసం సాహిత్యం అందించారు.
త్వరలో ఈ చిత్ర ఆడియో లాంచ్ కార్యక్రమం గ్రాండ్ గా జరుపుకుని, విడుదలకి సిద్ధమవుతుంది. ఈ సినిమా కేవలం నేటి యువతను దృష్టిలో పెట్టుకొని చేసి తీశారు. ప్రస్తుతం ఉన్న యంగ్ స్టర్స్ లైఫ్ స్టైల్ ను కళ్ళకు కట్టినట్లు దర్శకుడు విజే సాగర్ మ్యానిప్యూలేటర్ సినిమాలో చూపించడం జరిగింది.