కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో మూతపడిన థియేటర్లు మెల్ల మెల్లగా తెరుచుకుంటున్నాయి. ఆల్రెడీ ‘తిమ్మరుసు’ ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’ వంటి చిత్రాలు రిలీజ్ అయ్యి మంచి ఫలితాలనే సాధించాయి. ఇటీవల విడుదలైన ‘పాగల్’ కూడా టాక్ తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్లను రాబడుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మరో వారం పాటు కర్ఫ్యూని పెంచారు. అక్కడ 3 షోలు మాత్రమే ప్రదర్శింపబడతాయి. అంతేకాకుండా అక్కడ టికెట్ రేట్ల ఇష్యు కూడా రీసాల్వ్ కాలేదు.
ఆ సమస్య తీరే వరకు మీడియం రేంజ్, పెద్ద సినిమాలు వంటివి రిలీజ్ కావడం కష్టం. ప్రస్తుతం రూ.5 కోట్ల లోపు బిజినెస్ జరిగే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.మళ్ళీ థర్డ్ వేవ్ వచ్చి థియేటర్లు మూతపడితే.. చిన్న సినిమాల పరిస్థితి మరింత ఘోరంగా తయారవుతుంది.అందుకే వారానికి 5 కి తగ్గకుండా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం కూడా అదే కౌంట్ ఉండడం విశేషం. శ్రీవిష్ణు హీరోగా నటించిన `రాజరాజ చోర`,
సునీల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన `కనబడుట లేదు`, శ్రీముఖి ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్రేజీ అంకుల్స్, సంపూర్ణేష్ బాబు ‘బజార్ రౌడీ’, ‘చేరువైనా.. దూరమైనా’ వంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో `రాజ రాజ చోర` మూవీకి మాత్రమే కాస్త క్రేజ్ ఉంది. మరి మిగిలిన సినిమాల రిజల్ట్ ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సి ఉంది.
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!