Mohan Babu: గతం గతహా అంటూ మంచు కుటుంబ గొడవల గురించి ఇండైరెక్ట్ కామెంట్ చేసిన మోహన్ బాబు!

2024లో జరిగిన అతిపెద్ద రచ్చల్లో మంచు కుటుంబ ఆస్తుల గొడవలు అతిపెద్ద హైలైట్ గా నిలిచిన విషయం ఎవ్వరూ మర్చిపోలేరు. సంధ్య థియేటర్ ఇష్యూ జరగకపోయి ఉంటే.. మంచు ఫ్యామిలీ ఎపిసోడ్ ను న్యూస్ ఛానల్స్ కనీసం ఓ 100 ఎపిసోడ్లు రన్ చేసి ఉండేవి. ఆ గొడవ అనంతరం కూడా మంచు బ్రదర్స్ ఒకరి మీద ఒకరు కేసులు వేసుకొని నానా హంగామా చేశారు. ఈ విషయంలో మోహన్ బాబు (Mohan Babu)  కూడా ఓ రిపోర్టర్ ని మైక్ తో కొట్టి, అనంతరం మీడియా మొత్తం ఆయన్ని టార్గెట్ చేసి “మనిషివా మోహన్ బాబువా?” అనే క్యాప్షన్ తో నానా యాగీ చేశాక, వేరే ఆప్షన్ లేక మోహన్ బాబు స్వయంగా హాస్పిటల్ కి వచ్చి క్షమాపణలు చెప్పడం వంటివన్నీ జరిగాయి.

Mohan Babu

అయితే.. అప్పటి నుండి మోహన్ బాబు మీడియాకి దూరంగా ఉంటూ వచ్చారు. అనంతరం పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నారు అని కూడా కామెంట్స్ వచ్చాయి. ఇన్నాళ్ల తర్వాత మోహన్ బాబు ఓ ప్రెస్ మీట్ కి వచ్చి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. దాంతో ఆల్మోస్ట్ అందరూ మోహన్ బాబును ఏమైంది అంటూ ప్రశ్నించగా.. తాను “రాయలసీమ రామన్న” సినిమాలో చెప్పిన డైలాగ్ ను గుర్తుచేస్తూ.. “గతాన్ని మార్చలేము, కానీ ఈ రోజు మనం ఏమి చేయాలో అది చేయాలి.

రేపు మరింత గొప్పగా చేయడంపై మనం దృష్టి పెట్టాలి” అంటూ టాపిక్ ను మరీ ఎక్కువగా సాగదీయకుండా సింపుల్ గా జవాబు ఇచ్చినట్లున్నారు. అయితే.. మీడియా మాత్రం ఏమైంది అంటూ అడుగుతూనే ఉండగా.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పేసి వెళ్లిపోయారు. మరి మంచు ఫ్యామిలీ గొడవల్లో ఏమైనా క్లారిటీ వచ్చిందా? లేక సర్దుమణిగాయా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus