టాప్‌ 100 సినిమాల కొత్త లిస్ట్‌.. మన నాలుగు సినిమాలేంటంటే?

  • March 10, 2023 / 04:01 PM IST

ఈ రోజుల్లో పెద్ద సినిమా ఎవరు చూస్తారండి… ఈ మాట చాలాసార్లు వినే ఉంటారు. ఇక్కడ పెద్ద సినిమా అంటే పెద్ద హీరోలు, పెద్ద దర్శకులు, పెద్ద నిర్మాతలు తీసే సినిమాలని కాదు. ఎక్కువ నిడివి ఉన్న సినిమాలు అని. మూడు గంటల సినిమా అంటే ‘మూడు గంటల సినిమానా?’ అని ఆశ్చర్యపోతున్న రోజులివి. అయితే అలాంటి సినిమాలన్నీ ఓ లిస్ట్‌ చేసి ప్రముఖ మూవీ/ ఎంటర్‌టైన్మెంట్‌ రేటింగ్‌ సంస్థ రొటన్‌ టమోటాస్‌ ఓ లిస్ట్‌ విడుదల చేసింది.

ఈ లిస్ట్‌లో మన దేశంలో నుండి నాలుగు సినిమాలు ఉండటం గమనార్హం. రొటన్‌ టమోటాస్‌ రిలీజ్‌ చేసిన కొత్త లిస్ట్‌లో ‘RRR’ సినిమా కూడా ఉంది. ఈ సినిమా మూడు గంటలకుపైగా నిడివితో విడుదలైన విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. అంతే కాదు ఓటీటీలోకి వచ్చాక అంతర్జాతీయంగా మంచి గుర్తింపును కూడా తెచ్చుకుంది. అలా పేరుతోపాటు పురస్కారాలు కూడా వస్తున్నాయి.

ప్రస్తుతం ‘నాటు నాటు..’ పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ఆస్కార్‌ రేసులో ఉన్న విషయం తెలిసిందే. 95వ ఆస్కార్‌ పురస్కారాల వేడుక ఈ నెల 12న (మన దేశంలో 13న ఉదయం) జరగనుంది. ఈ క్రమంలో రోటెన్‌ టొమాటోస్‌ తాజాగా విడుదల చేసిన ఉత్తమ 100 చిత్రాల జాబితాలో ‘ఆర్‌ఆర్ఆర్‌’ సినిమా చోటు సంపాదించుకుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా 12వ స్థానంలో నిలవగా, ఆమిర్‌ ఖాన్‌ – అషుతోష్‌ గోవారికర్‌ కాంబోలో వచ్చిన ‘లగాన్‌’ 13వ ప్లేస్‌లో ఉంది. రిచర్డ్‌ అటెన్‌బర్గ్‌ ఆస్కార్‌ విన్నింగ్‌ సినిమా అయిన ‘గాంధీ’కి 32వ స్థానం దక్కింది.

అనురాగ్‌ కశ్యప్‌ తెరకెక్కించిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వసీపుర్ 70వ ప్లేస్‌లో నిలిచింది. ఆ లిస్ట్‌లో చూస్తే సెవెన్‌ సమురాయ్‌ (1954), మేడ్‌ ఇన్‌ అమెరికా (2006), ఉడ్‌ ల్యాండ్స్‌ డార్క్‌ అండ్‌ డేస్‌ బివిచ్డ్‌: ఏ హిస్టరీ ఆఫ్‌ ఫోక్‌ హారర్‌ (2021), ఫ్యాన్నీ అండ్‌ అలెగ్జాండర్‌ (1982), సిండ్లర్స్‌ లిస్ట్‌ (1993), ది లెపార్డ్‌ (1963), చిల్డ్రన్‌ ఆఫ్‌ పారడైజ్‌ (1945), ది గాడ్‌ ఫాదర్‌పార్ట్‌ – 2 (1974), ది రైట్‌ స్టఫ్‌ (1983), ది లాస్ట్‌ ఆఫ్‌ ది అన్‌జస్ట్‌ (2013) తదితర చిత్రాలున్నాయి.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus