Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్’ కావాలట.. సాధ్యమేనా?
- March 18, 2026 / 10:55 AM ISTByFilmy Focus Desk
సినిమాల్లో ఐటెమ్ సాంగ్ ఉంటే చూడటానికి ప్రేక్షకులకు హ్యాపీనే. అందులోనూ స్టార్ హీరోయిన్ చేసే ప్రత్యేక గీతమంటే ఇంకా ప్రత్యేకం. కానీ ఆ పాట కోసం ఆ హీరోయిన్‌ని ఓకే చేయించడం ఎంత కష్టమే.. ఆ సినిమా టీమ్‌కే తెలుసు. ‘పుష్ప: ది రూల్’ సినిమాలో ఐటెమ్ సాంగ్ కోసం చాలామంది చుట్టూ తిరిగి తిరిగి ఆఖరికి శ్రీలీలను ఓకే చేశారు. ఇలా ఒక్క హీరోయినే కష్టం అనుకుంటూ ఉంటే.. ఇప్పుడు ఒకే ఐటమ్ సాంగ్‌లో నలుగురు హీరోయిన్లను పెడతాం అంటున్నారు ‘పెద్ది’ టీమ్. అవును, మీరు చదివింది నిజమే.
Peddi
వచ్చే నెల 30న విడుదలకు సిద్ధమవుతున్న ‘పెద్ది’ సినిమాకు సంబంధించి చిత్రీకరణ అంతా అయిపోయింది అంటున్నారు కానీ.. ఒక ఐటెమ్ సాంగ్ పెండింగ్‌లో ఉందని టాక్. దాని కోసం సినిమా టీమ్ కాస్టింగ్ ముమ్మరం చేసింది అంటున్నారు. ఈ క్రమంలో నలుగురు హీరోయిన్లు ఆ పాటలో ఉంటారు అనే మాట బయటకు వచ్చింది. కుదిరతే నలుగురు స్టార్ హీరోయిన్లు, లేదంటే ఒక స్టార్ హీరోయిన్, మిగిలిన ముగ్గురు యంగ్ హీరోయిన్లు ఉండాలి అని దర్శకుడు బుచ్చిబాబు సానా అంటున్నారట.
ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ కోసం బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ల పేర్లను చాలా రోజుల నుండి పరిశీలిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ పేరు ఎక్కువగా వినిపించింది. ఆమె కూడా ఆ మధ్య హైదరాబాద్ వచ్చి ఓ టెస్ట్ షూట్ చేసిందన్నారు. కానీ ఆ తర్వాత ఆమె మళ్లీ రాలేదు. ఓ పాత హిట్ సాంగ్‌ను తీసుకొని ఇప్పటి వైబ్‌కి మ్యాచ్ చేసేలా సెమీ రీమిక్స్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారట.
అయితే, ఈ సంగతి తేల్చడానికి టీమ్ దగ్గర ఎక్కువ రోజులు లేదు. కనీసం రెండు వారాల ప్రచారం సినిమాకు కావాలి. పక్క రాష్ట్రాలకు వెళ్లి కూడా ప్రచారం చేయాల్సి వస్తుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆఖరి వరకు ఎలా గూ ఉంటాయి. కాబట్టి ఈ నెలాఖరులోగా ఈ పాట పూర్తి చేసేయాలని టీమ్ అనుకుంటోందట.
















