Janhvi Kapoor: జాన్వీ చెబితే ఉ అనేశాం కానీ.. మరి ఆ సినిమాల్లో ఆమె చేసిన పాత్రల సంగతేంటి?
- November 1, 2026 / 12:40 PM ISTByFilmy Focus Desk
‘పెద్ది’ సినిమా గురించి చాలా మంది కష్టపడ్డారు. అందుకోసమే నా పాత్ర మీద వచ్చిన విమర్శల గురించి మాట్లాడేందుకు సంకోచించాను. అయితే సినిమాలో నా పాత్రపై నెగిటివ్ ప్రచారం నన్ను మరింత బాధించింది. కొన్ని సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయి. నా పాత్ర విషయంలో జరిగిన దానికి నేను బాధ్యత తీసుకోవాల్సిందే. 100 శాతం అది నా పొరపాటే. నేను అప్రమత్తంగా ఉండాల్సింది.. ఇదీ ‘పెద్ది’ సినిమా కాంట్రవర్శీపై జాన్వీ కపూర్ స్టేట్మెంట్.
Janhvi Kapoor
‘పెద్ది’ సినిమాలో అచ్చియమ్మ పాత్రను చూపించిన విధానం, కెమెరా యాంగిల్స్, డ్రెస్సింగ్ సెన్స్.. ఇలా ఏదీ అప్రిషియేటివ్ కాదు. అలాంటి పాత్రల్లో అభిమాన హీరోయిన్ని చూడాలని ఎవరూ కోరుకోరు కూడా. అందుకే ఆ పాత్ర గురించి, ఆ తర్వాత వచ్చిన రియాక్షన్స్ గురించి ఆమె మాటలు విన్నప్పుడు ‘అవును నిజమే కదా’ అని అందరికీ అనిపిస్తుంది. అయితే ఇందులో కేవలం సినిమా టీమ్ మాత్రమే తప్పు చేసిందా అంటే కాదు అనే చెప్పాలి.
ఎందుకంటే ఓ గంట ఎక్కువ పని చేయాలి, ఇలాంటి మేకప్ వేసుకోవాలి, అలాంటి డ్రెస్‌లు వేసుకోవాలి అంటే.. ‘ఛస్ నేనలా చేయను.. నేను సినిమా నుండి క్విట్’ అని చెబుతున్న హీరోయిన్లు ఉన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆమె. కానీ ఎందుకలా అనింది, అలా అని గతంలో ఎప్పుడు అలాంటి పాత్రలు ఆమె చేయలేదా? అలాంటి డైలాగ్‌లు ఆమె చెప్పలేదా? అంటే చెప్పింది అనే అనాలి.

అంతెందుకు ‘దేవర’ సినిమాలో చేసిన తంగమ్ పాత్ర కూడా దాదాపు ఇలాంటి లుక్, డైలాగ్స్‌తోనే నిండి ఉంటుంది. ఆ విషయం వదిలేస్తే బాలీవుడ్లో ఆమె చేసిన కొన్ని సినిమాల్లో అంగాంగ ప్రదర్శన ఉంటుంది.. అవసరం లేని స్కిన్ షో ఉంటుంది. లేనిపోని డైలాగ్‌లు కూడా ఉంటాయి. స్పెషల్ సాంగ్‌లో స్పెషల్ అందాల ట్రీట్ కూడా ఇచ్చింది . ముఖ్యంగా ‘సన్నీ సంస్కారీ తులసీ కుమారి’ సినిమాలో ఆమె టాలెంట్ మనం చూశాం కూడా.
అంతేకాదు ఆ సినిమాను ఇప్పుడు ‘పెద్ద’ గురించి ప్రశ్న అడిగి.. జాన్వీకి విక్టిమ్ కార్డు ఇచ్చిన కరణ్ జోహారే నిర్మించారు. అందులో జాన్వీని ఆయనేమీ నిండుగా చూపించలేదు. అందాల ప్రదర్శనలో మెండుగా చూపించారు. అలాంటి ఇద్దరు ‘పెద్ది’ మీద, తద్వారా టాలీవుడ్ మీద అక్కసు వెళ్లగక్కడం ఎందుకో?













