Devara: ఫస్ట్ వీకెండ్ కంటే ఫస్ట్ మండే రికార్డ్స్ కీలకం దేవర!

ఒక సినిమా సూపర్ హిట్ అని తేల్చేది మొదటి వారాంతపు కలెక్షన్స్ అయినప్పటికీ.. ఒక సినిమా నిజంగా ప్రేక్షకులకు చేరువైంది అని నిరూపించేది మాత్రం తొలి సోమవారం కలెక్షన్స్. ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన సినిమాలన్నీ తొలి సోమవారం తమ సత్తా చాటుకున్నవే. ఇప్పుడు ఈ తొలి సోమవారం అనే యాసిడ్ టెస్ట్ పాసవ్వాలిన పరిస్థితి “దేవర”కు (Devara) వచ్చింది. తొలివారాంతపు కలెక్షన్స్ 304 కోట్ల రూపాయలు అని ఎంతో గర్వంగా పోస్టర్ రిలీజ్ చేశారు నిర్మాతలు.

Devara

నెంబర్ కాస్త అటుఇటుగా మంచి కలెక్షన్స్ వచ్చాయి అనే చెప్పాలి. అయితే.. ఆ దూకుడు అలానే కంటిన్యూ అవ్వడం అనేది “దేవర” ఫైనల్ రిజల్ట్ కి చాలా కీలకం కానుంది. అయితే.. అక్టోబర్ 2 గాంధీ జయంతి సెలవు మరియు 3వ తారీఖు నుండి దసరా సెలవులు మొదలవ్వనున్నాయి. ఈ హాలిడే సీజన్ లో ఆడియన్స్ కు ఎకైక పెద్ద సినిమా ఆప్షన్ “దేవర”.

ఈ క్రేజ్ ను ఏమాత్రం క్యాష్ చేసుకోగలిగినా “దేవర” 600 కోట్ల మార్క్ ను దాటడం చాలా ఈజీ. అయితే.. ఈ సోమవారం కలెక్షన్స్ ఆ లాంగ్ రన్ ను డిసైడ్ చేయనుంది. మరి దేవర ఈ మండే టెస్ట్ ను ఎలా జయిస్తాడో చూడాలి. ఇకపోతే.. కొరటాల మాత్రం సినిమా సాధిస్తున్న కలెక్షన్స్ తో చాలా హ్యాపీగా ఉన్నాడు.

నిర్మాతగా కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కూడా ఫుల్ హ్యాపీ. జాన్వీ కపూర్ (Janhvi Kapoor)   కూడా తెలుగులో తొలి చిత్రంతోనే ఈస్థాయి విజయం సాధించినందుకు.. మంచి లాంచ్ ప్యాడ్ దొరికినందుకు సంతోషంగా ఉంది. ఇలా అందరికీ ఆనందాన్ని పంచుతున్న “దేవర” ఫ్యాన్స్ ను సైతం ఖుష్ చేసింది. ఇప్పుడు అందరి చూపులు ఎన్టీఆర్ తదుపరి సినిమా “వార్ 2″పై ఉన్నాయి.

క్రైమ్‌ కామెడీ దర్శకుడితో వరుణ్‌తేజ్‌ నెక్స్ట్‌.. పేరు ఇదేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus