Chiranjeevi: ఎవరి ఒత్తిడితోనో మెగాస్టార్ ఆస్తులు అమ్మ లేదు!

స్వయంకృషితో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంచలంచలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎదుగుతూ నేడు చిత్రపరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ యువ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న మెగాస్టార్ ఇప్పటికే సినిమాలలో నటించి కొన్ని వందల కోట్లు ఆస్తిపాస్తులను సంపాదించారు. గత రెండు రోజుల నుంచి చిరంజీవి ఆస్తులకు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

చిరంజీవి ఎంతో ఖరీదైన ఒక ప్రాపర్టీని అమ్మేసారని,అలాగే ఒక దినపత్రిక యజమాని ఒత్తిడి చేయడం వల్లే ఈ ఆస్తి అమ్మారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ విషయంపై ఆయన సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఆస్తి అమ్మిన విషయం నిజమే కానీ ఎవరో ఒత్తిడి చేయడం వల్ల ఈ ఆస్తి అమ్మారనడంలో ఏమాత్రం వాస్తవం లేదని అతని సన్నిహితులు వెల్లడించారు. ఇద్దరు పరస్పర అంగీకారం ప్రకారమే ఎంతో స్నేహపూర్వకమైన వాతావరణంలో ఈ ప్రాపర్టీని చిరంజీవి అమ్మినట్లు వెల్లడించారు.

ఇక ఈ ప్రాపర్టీ గతంలో అత్యంత తక్కువ ధరకే చిరంజీవి కొనుగోలు చేశారు. ఇకపోతే చిరంజీవి ఈ ఆస్తిని ఫినిక్స్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు అమ్మినట్టు తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ సమస్థ ఈ ప్రాపర్టీకి భారీ డీల్ కల్పించడంతో తన ల్యాండ్ కు మంచి ఆదాయం రావటం వల్లే చిరంజీవి ఈ ఆస్తిని అమ్మారని అంతకుమించి ఏమీ లేదని వెల్లడించారు.

ఇలా కొందరి ఒత్తిడి కారణంగా ఈ ఆస్తులు అమ్మారంటూ మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ వస్తున్న వార్తలలో ఏ మాత్రం నిజం లేదని ఆ వార్తలను కొట్టి పారేశారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus