మహేష్ కూడా హ్యాండిచ్చేసాడుగా..!

ఈ ఏడాది అనిల్ రావిపూడి డైరెక్షన్లో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మహేష్ బాబు. ఈ హిట్ తో హ్యాట్రిక్ కంప్లీట్ చేసాడు. ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ .. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న మహేష్ బాబు తన తదుపరి సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చేయబోతున్నట్టు ఎప్పుడో ప్రకటించాడు. కానీ ఆ ప్రాజెక్ట్ ఎందుకో పట్టాలెక్కలేదు. వంశీ వినిపించిన స్క్రిప్ట్ పట్ల.. మహేష్ సంతృప్తి చెందకపోవడమే కారణమని తెలుస్తుంది.

దీంతో ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్(బుజ్జి) తో మహేష్ తన నెక్స్ట్ సినిమా చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. బౌండ్ స్క్రిప్ట్ కూడా రెడీ అయ్యింది. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు అయిన మే 31న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించాలి అని అనుకున్నారు. కానీ కృష్ణ సతీమణి దివంగత దర్శకురాలు విజయనిర్మల మరణించి ఏడాది కూడా పూర్తి కాలేదు కాబట్టి.. ఎటువంటి వేడుకలు నిర్వహించవద్దు అని కృష్ణ అభిమానులతో పాటు సన్నిహితులకు కూడా చెప్పారట.

దీంతో ఆ రోజు మహేష్ సినిమాకు సంబంధించి కూడా ఎటువంటి ప్రకటన రాదు.. కొత్త సినిమా కూడా ఆరోజు ప్రారంభం కాదు అని తెలుస్తుంది. ఇది మహేష్ అభిమానులకు నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. రాజమౌళితో మహేష్ చేస్తున్న చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఆరోజు ఇవ్వాలి అని ముందుగా భావించారు. కానీ ఆ విశేషాన్ని కూడా పోస్ట్ పోన్ చేస్తున్నారని సమాచారం.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus