VeeraSimha Reddy: థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కి థియేటర్లు దద్దరిల్లుతాయ్..

ఫస్ట్ లుక్, టైటిల్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఏ కాదు.. సినిమా ప్రమోషన్స్ లో మేకర్స్ చెప్పే మాటలు కూడా సినిమా మీద అంచనాలు అమాంతం పెంచేస్తాయ్.. బాలయ్య, గోపిచంద్ మలినేని కలయికలో, మైత్ర మూవీస్ నిర్మిస్తున్న యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి ‘వీర సింహా రెడ్డి’ అనే పవర్ ఫుల్ పేరుతో పాటు.. ‘గాడ్ ఆఫ్ మాసెస్’ అనే సాలిడ్ ట్యాగ్ లైన్ కూడా పెట్టారు..

టైటిల్, మోషన్ పోస్టర్ రివీల్ చెయ్యడంతో బాలయ్య అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దు అన్నట్టుగా తయారైంది పరిస్థితి.. సోషల్ మీడియాలో ‘వీర సింహా రెడ్డి’ ని వీర లెవల్లో వైరల్ చేస్తున్నారు. కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర టైటిల్ లాంఛ్ చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇప్పటివరకు అక్కడ సినిమా షూటింగ్స్ అయితే జరిగాయి కానీ ఈవెంట్ జరగడం మాత్రం ఇదే ఫస్ట్ టైమ్.. టైటిల్, మోషన్ పోస్టర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

 

డైరెక్టర్ గోపిచంద్ తాను బాలయ్య వీరాభిమానిగా ఈ సినిమా తెరకెక్కించానని.. మా బావ థమన్ ఈ సినిమాకిచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ మామూలుగా ఉండదని, సాంగ్స్, డ్యాన్స్ అన్నీ అదిరిపోతాయని చెప్పుకొచ్చాడు.. ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్ ఏంటంటే.. ‘అఖండ’ పూనకాలు తెప్పించేలా నేపథ్య సంగీత మిచ్చిన యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్.. ‘వీర సింహా రెడ్డి’ వీర లెవల్లో మ్యూజిక్ ఇస్తున్నాడని.. మోషన్ పోస్టర్ వీడియోకిచ్చిన స్కోర్ నే ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చని..

ముఖ్యంగా సినిమాలో ఫ్యాన్స్, ఆడియన్స్ విజిల్స్ వేసే రేంజ్ లో ఊరమాస్ యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువగా ఉంటాయని.. వాటికి థమన్ ‘అఖండ’ లానే థియేటర్లో బాక్సులు బద్దలయ్యేలా బ్యాగ్రౌండ్ స్కోర్ ఇస్తున్నాడని అంటున్నారు. వచ్చే సంక్రాంతికి బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ గా బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నాడు.. టైటిల్ లో ‘సింహా’ ఉండడం.. పైగా సంక్రాంతికి రిలీజ్ కానుండడంతో ఇటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ.. అటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి..

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus