Prabhas – Riddhi Kumar: ఆ రోజు రాలేదనే రిద్ధికి చీర ఇచ్చిన ప్రభాస్‌.. అసలేం జరిగిందంటే?

‘మీరు కొనిచ్చిన చీర కట్టుకొచ్చాను ప్రభాస్‌..’ అంటూ ఈ మధ్య జరిగిన ‘ది రాజా సాబ్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ముద్దుగా, గొప్పగా చెప్పుకొచ్చింది బాలీవుడ్‌ కథానాయిక, ప్రభాస్‌తో రెండో సినిమా చేస్తున్న రిద్ధి కుమార్‌ చెప్పింది. ‘రాధేశ్యామ్‌’ తర్వాత ఆమె ఎక్కడా పెద్దగా సినిమాలు చేసింది లేదు. ‘ది రాజా సాబ్‌’ కోసం ఆమెను ముంబయి వెళ్లి మరీ కాస్టింగ్‌ చేశారు. ఈ మొత్తం విషయాలను కలుపుకొని ‘అంటే.. యస్‌’ అనుకుంటూ కొంతమంది చిలిపి నెటిజన్లు జోకులు కూడా వేసుకుంటున్నారు. అయితే ఆ చీర కథేంటో ఆమెనే ఓ మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది.

Prabhas – Riddhi Kumar

స్టేజీ మీద రిద్ధి చెప్పినట్లుగా.. ఆ చీరను మూడేళ్ల క్రితమే ప్రభాస్‌ ఆమెకు ఇచ్చాడట. మూడేళ్ల ముందు ‘ది రాజా సాబ్’ సినిమా సెట్లోకి ఆమె అడుగు పెట్టినపుడు ప్రభాస్‌ ఇచ్చాడట. అంత‌కంటే ముందు పుట్టిన రోజు సందర్భంగా ఒకసారి, దీపావ‌ళికి మరోసారి ప్ర‌భాస్ యూనిట్‌లో అంద‌రికీ ప్ర‌భాస్ పార్టీ ఇచ్చాడట. వాటికి రిద్ధి రాలేకపోయిందట. దాంతో ప్రభాస్‌ తనకు చీరను గిఫ్ట్‌గా ఇచ్చాడని రిద్ధి చెప్పుకొచ్చింది. ఆ సమయంలో ప్రభాస్‌కి ఆమె ఓ గిఫ్ట్‌ కూడా ఇచ్చిందట. అది కర్ణుడికి సంబంధించిన గిఫ్ట్‌ అట.

ఆ బుక్‌ చూసి అప్పుడు ప్రభాస్‌ ఆశ్చర్యపోయాడట. ఎందుకు షాక్‌ అయ్యారు అని రిద్ధి అడిగితే.. తర్వాత నీకే తెలుస్తుందిలే అని అన్నాడట. అక్కడికి కొద్ది రోజులకు వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో కర్ణుడిలా కనిపించాడు. అప్పుడు రిద్ధికి ఆ రోజు ప్రభాస్‌ చెప్పిన మాటలు గుర్తొచ్చాయట. ఇదీ ప్రభాస్‌ ఇచ్చిన చీర వెనుక కథ. మామూలుగా ప్రభాస్‌ అందరికీ భోజనాలు పెట్టి, మొహమాట పెడుతుంటాడు. రిద్ధికి చీర ఇచ్చాడన్నమాట. అయితే నెక్స్ట్‌ ఆయనతో పని చేసే హీరోయిన్లు కూడా ఇలా పార్టీలకు హాజరు కాకపోతే చీరలు ఇస్తాడేమో చూడాలి.

ఇంత పెద్ద విజయం ఎవరూ చూసుండరు.. ఆ సినిమాకు అదిరిపోయే వసూళ్లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus