సుడిగాలి సుధీర్ హీరోగా రూపొందిన రెండో చిత్రం ‘గాలోడు’. రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల తెరకెక్కించిన ఈ మూవీని ఆయనే నిర్మించాడు. గెహ్నా సిప్పి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించింది.ట్రైలర్ లో మాస్ ఆడియన్స్ కి కావాల్సిన అంశాలు అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా భీమ్స్ సిసిరోలియో సంగీతంలో రూపొందిన పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే మొదటి రోజు సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది.
మల్టీప్లెక్స్ ఆడియన్స్ నుండి ఈ మూవీకి నెగిటివ్ రెస్పాన్స్ వస్తే… సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ మాత్రం పాజిటివ్ టాక్ చెబుతున్నారు. ఈ క్రమంలో ఓపెనింగ్స్ ఎలా ఉండొచ్చు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘గాలోడు’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 435 థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అంటే మిడ్ రేంజ్ హీరోల సినిమాల స్థాయిలోనే ఈ మూవీ రిలీజ్ అయ్యిందన్న మాట. ఇక టాక్ తో సంబంధం లేకుండా బుకింగ్స్ బాగానే జరిగాయి.
ముఖ్యంగా బి,సి సెంటర్స్ లో ‘గాలోడు’ సినిమాకి బుకింగ్స్ చాలా బాగా జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలోని చాలా థియేటర్లలో మార్నింగ్ షోలకు హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. ఎక్కడా కూడా ఇది జబర్దస్త్ కమెడియన్ మూవీ అనేలా అయితే అనిపించడం లేదు. ఓవరాల్ గా చూసుకుంటే..
‘గాలోడు’ సినిమాకి మొదటి రోజు రూ.40 లక్షల వరకు షేర్ ను రాబట్టే అవకాశం ఉంది. నవంబర్ వంటి అన్ సీజన్లో ఈ రేంజ్ ఓపెనింగ్స్ ఎక్కువనే చెప్పాలి. అలాగే రెండో రోజుకి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్నాయి. ఇప్పటి ఊపుని బట్టి చూస్తే మొదటి వీకెండ్ ఈ మూవీ ఈజీగా 50 శాతం రికవరీ సాధించే అవకాశం ఉంది.