బుల్లితెర పవర్ స్టార్ గా పేరుతెచ్చుకున్న సుడిగాలి సుధీర్… హీరోగా చేసిన రెండో చిత్రం ‘గాలోడు’. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీలో హీరోయిన్గా గెహ్నా సిప్పి నటిస్తుంది. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు ‘సంస్కృతి ఫిలింస్’ బ్యానర్ పై నిర్మించారు. టీజర్, ట్రైలర్ ఎలా ఉన్నా ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన పాటలకు మంచి స్పందన లభించింది.
అందులోనూ సుధీర్ హీరోగా నటించిన మొదటి చిత్రం ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ టాక్ తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్లు సాధించింది.దీంతో నవంబర్ 18న రిలీజ్ కాబోతున్న ‘గాలోడు’ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలను గమనిస్తే :
నైజాం
0.75 cr
సీడెడ్
0.50 cr
ఆంధ్ర
0.85 cr
ఏపీ +తెలంగాణ
2.10 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
0.35 cr
వరల్డ్ వైడ్(టోటల్)
2.45 cr
‘గాలోడు’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.2.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.2.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సింది. సుడిగాలి సుధీర్ సినిమాకి ఈ రేంజ్ బిజినెస్ జరగడం మామూలు విషయం కాదు. ముఖ్యంగా మాస్ ఏరియాల్లో ఈ మూవీకి మంచి బిజినెస్ జరిగింది.
టాక్ ఏమాత్రం పాజిటివ్ గా వచ్చినా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.తొలి రోజుకు అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరిగాయి. ఈ మధ్య కాలంలో ఇంత క్రేజ్ ఉన్న మూవీ రిలీజ్ కాలేదు కాబట్టి.. ‘గాలోడు’ సినిమా మంచి ఓపెనింగ్స్ ను సాధించే అవకాశం లేకపోలేదు.