Gaalodu OTT: గాలోడు ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్..!

సుడిగాలి సుధీర్ హీరోగా గెహ్నా సిప్పీ హీరోయిన్ గా ‘సంస్కృతి ఫిలింస్’ బ్యానర్ పై రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గాలోడు. రాజశేఖర్ రెడ్డినే ఈ చిత్రానికి నిర్మాత కూడా..! టీజ‌ర్ , ట్రైలర్‌ వంటివి మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి.పాటలు అయితే సూపర్ హిట్ అయ్యాయి. దీంతో సినిమా పై అంచనాలు పెరిగాయి.అయితే నవంబర్ 18న రిలీజ్ అయిన ఈ మూవీకి మొదటి రోజు మిక్స్డ్ టాక్ నమోదైంది .

అయినప్పటికీ ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి. 5 రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించింది. మాస్ సెంటర్స్ లో ఈ మూవీ ఇప్పటికీ డీసెంట్ రన్ ను కొనసాగిస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ మూవీ ఓటీటీకి ఎప్పుడు వస్తుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అందుతున్న సమాచారం ప్రకారం.. గాలోడు మూవీ డిసెంబర్ రెండో వారం నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ చిత్రం డిజిటల్ హక్కులను రూ.3.5 కోట్లకు కొనుగోలు చేసిందట డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ. సుడిగాలి సుధీర్ సినిమాకి ఇంత పెట్టి కొనడం అంటే మామూలు విషయం కాదు. సుధీర్ నటించిన మొదటి సినిమా సాప్ట్ వేర్ సుధీర్ చిత్రం మంచి ఓపెనింగ్స్ సాధించింది కానీ బ్రేక్ ఈవెన్ కాలేదు. అయితే గాలోడు బ్రేక్ ఈవెన్ సాధించి సుధీర్ కెరీర్ లో మొదటి కమర్షియల్ హిట్ గా నిలిచింది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus