Gaayapadda Simham: ‘గాయపడ్డ సింహం’… గట్టిగా అదరగొట్టేలానే ఉందిగా!

Advertisement

ఓ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే సినిమాలోని స్టఫ్‌ ఎంత ముఖ్యమో.. ఆ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడం కూడా అంతే ముఖ్యం. అంటే ప్రమోషనల్‌ స్టఫ్‌. తొలి విషయం సినిమా వచ్చాక తెలుస్తుంది. రెండో విషయం మాత్రం సినిమా విడుదలకు ముందే తెలుస్తుంది. ఇప్పుడు ఈ రెండో స్టెప్‌లో అదిరిపోయే కంటెంట్‌, స్టయిల్‌తో దూసుకెళ్తోంది ‘గాయపడ్డ సింహం’ టీమ్‌. తరుణ్‌ భాస్కర్, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమాకు కశ్యప్‌ శ్రీనివాస్‌ దర్శకుడు.

Gaayapadda Simham

దర్శకుడు పవన్‌ సాదినేని సమర్పణలో సప్తస్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్‌ నిర్మించిన ఈ సినిమా మే 1న థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు చిత్రబృందం ట్రెండింగ్‌ ప్రచారంతో దూసుకెళ్తోంది. ఏఐ వీడియోలు, సోషల్‌ మీడియా ట్రెండ్‌లతో సినిమా నేటి తరం సినిమా ప్రేక్షకుల నోట నానుతోంది. దానికి తోడు సినిమా కాన్సెప్ట్‌, టైటిల్‌ ఆసక్తికరంగా ఉండటం కూడా కలసివస్తోంది. ఇదంతా చూస్తుంటే ‘గాయపడ్డ సింహం’ గట్టిగానే అదరగొట్టేలా ఉంది అనే మాట వినిపిస్తోంది.

హీరో తరుణ్‌ భాస్కర్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని కసితో రగిలిపోతున్నాడు. ట్రంప్‌పై ఎందుకు పగ బట్టాడు, అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది తెలియాలంటే ‘గాయపడ్డ సింహం’ చూడాలి అంటూ ఓ చర్చ నడుస్తోంది. దానికితోడు సినిమా ట్రైలర్‌లోని ‘ఈ ప్రపంచంలో కొందరికి ప్రేమ కావాలి. కొందరికి డబ్బు కావాలి. కొందరికి ప్రపంచమే కావాలి’ అనే డైలాగ్‌ కూడా ఆసక్తికరంగా ఉంది. ‘ఇది నా ఒక్కడి రివెంజ్‌ కాదు రా. నాలా డిపోర్ట్‌ అయిన ప్రతి ఒక్కడి కోసం చేయాలనుకుంటున్న యుద్ధం’ అనే డైలాగ్‌ కూడా ఆసక్తికరంగా ఉంది.

ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం యూఎస్‌ఏ వెళ్లి సెటిల్‌ అవ్వాలనుకునే ఓ సగటు కుర్రాడి కథ ఇది. కానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకొచ్చిన కొత్త పాలసీ వల్ల ఆ కుర్రాడి కల ఆదిలోనే చెదిరిపోతుంది. ఆ తర్వాత అతనేం చేశాడన్నదే సినిమాలో ఆసక్తికరం అని టీమ్‌ చెబుతోంది. ఇక ఈ సినిమాలో సత్యగా జేడీ చక్రవర్తి తనదైన విలనిజం చూపించబోతున్నాడని ప్రచారంలో అర్థమవుతోంది. ఇక ట్రైలర్‌ ఆఖర్లో ఓ ప్రత్యేక పాత్రలో కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ శ్రీవిష్ణు కనిపించాడు.

కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus