‘బేబీ’ (Baby) వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) హీరోగా రూపొందిన చిత్రం ‘గం గం గణేశా’ (Gam Gam Ganesha). ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కేదార్ సెలగంశెట్టి , వంశీ కారుమంచి కలిసి నిర్మిస్తున్నారు. ప్రగతి శ్రీవాత్సవ (Pragati Srivasthava), నయన్ సారిక..ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. టీజర్, ట్రైలర్స్ ఆకట్టుకున్నాయి. వినాయక చవితి ఉత్సవాలు చుట్టూ తిరిగే కథ ఇది. అలాగే కామెడీ కూడా ఆకట్టుకునే విధంగా ఉండబోతుంది అనే హింట్ ఇచ్చారు.
మే 31 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం | 2.00 cr |
సీడెడ్ | 0.80 cr |
ఉత్తరాంధ్ర | 0.60 cr |
ఈస్ట్ | 0.30 cr |
వెస్ట్ | 0.25 cr |
గుంటూరు | 0.30 cr |
కృష్ణా | 0.40 cr |
నెల్లూరు | 0.20 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 4.85 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.25 cr |
ఓవర్సీస్ | 0.20 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 5.30 cr (షేర్) |
‘గం గం గణేశా’ చిత్రానికి రూ.5.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ కనుక వస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి.