సూపర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” (Game Changer) పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శంకర్ (Shankar) అత్యున్నత స్థాయి సాంకేతిక నైపుణ్యాలతో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల అమెరికాలో డల్లాస్‌లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ మూవీ ప్రమోషన్లకు శుభారంభాన్ని ఇచ్చింది. ఈ ఈవెంట్‌ను డిస్టిబ్యూటర్ రాజేష్ భారీ స్థాయిలో నిర్వహించారు. కార్యక్రమంలో రామ్ చరణ్ స్టేజ్‌పై ప్రత్యేకంగా డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించారు.
మేకర్స్ ఈ చిత్రానికి గణనీయమైన బడ్జెట్‌ను ఖర్చు చేస్తోన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు (Dil Raju) మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందించామని, ఆ సంఘటనలు ప్రేక్షకులకు చాలా దగ్గరగా అనిపిస్తాయని తెలిపారు. “శంకర్ గారు నాలుగేళ్ల క్రితమే స్క్రిప్ట్ రాసిన ఈ సంఘటనలు ఇప్పుడు నిజమైన ఫీల్ ను కలుగజేశాయి. ప్రేక్షకులు ఈ చిత్రంలో కనిపించే అంశాలకు క్లాప్ కొడతారని నమ్ముతున్నాను,” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సినిమాలో హైవోల్టేజ్ సామాజిక అంశాలు ప్రాధాన్యం పొందినట్లు తెలుస్తోంది. శంకర్ తన దృష్టిలోని పవర్ఫుల్ రైటర్‌ను బయటకు తీసుకువచ్చి, ప్రజా జీవితంలో కీలకమైన అంశాలను ఆధారంగా చేసుకుని కథ రాశారని సమాచారం. “భారతీయుడు”(Bharateeyudu ) లాంటి విజయాన్ని మరలా శంకర్ అందుకుంటాడని ట్రేడ్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇక “ఆర్ఆర్ఆర్” (RRR) వంటి గ్లోబల్ హిట్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సోలో ప్రాజెక్ట్ కావడంతో “గేమ్ ఛేంజర్”పై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.
ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ తన మార్కెట్‌ను మరింతగా స్థిరపరచుకునే అవకాశముంది. ముఖ్యంగా, ఈ చిత్రం కథనం సరికొత్తగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే సాంగ్స్ కొన్ని.పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. ఇక సినిమా ట్రైలర్ ను జనవరి మొదటి వారంలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.