దాదాపు 5 ఏళ్ళ తర్వాత రాంచరణ్ సోలో హీరోగా రాబోతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) .అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత రామ్ చరణ్ (Ram Charan) ఇమేజ్ కూడా పెరిగింది. అతనికి దేశవిదేశాల్లో ఫ్యాన్స్ ఏర్పడ్డారు. దర్శకుడు శంకర్ (Shankar) వాటిని దృష్టిలో పెట్టుకునే ‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని రూపొందించాడు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇప్పటికే ‘జరగండి’ ‘రా మచ్చ మచ్చ రా’ ‘నానా హైరానా’ ‘దోప్’ వంటి లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి.
వాటికి మంచి స్పందన లభించింది. టీజర్ కూడా రిలీజ్ చేశారు. అందులో చరణ్ గెటప్స్, లొకేషన్స్ హైలెట్ అయ్యాయి. కానీ కథ ఏంటి అన్నది.. దీంతో రివీల్ చేసింది లేదు. అయితే జనవరి 10న అంటే మరో 8 రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈరోజు ట్రైలర్ ను కూడా కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే ఇది 2 నిమిషాల 43 సెకన్ల నిడివి కలిగి ఉంది.
‘ కడుపు నిండా వంద ముద్దలు తిన్న ఏనుగు, ఒక్క ముద్ద వదిలి పెడితే పెద్దగా నష్టం ఏమీ ఉండదు. కానీ ఆ ఒక్క ముద్ద లక్ష జీవాలకి ఆహారం. నేను మిమ్మల్ని అడిగేది కూడా ఆ ఒక్క ముద్ద’ అంటూ హీరో రామ్ చరణ్ పలికే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. రామ్ చరణ్ 3 రకాల లుక్స్ లో కనిపించాడు. హీరోయిన్లలో కియారా కంటే కూడా అంజలి హైలెట్ అయ్యేలా ఉంది. ట్రైలర్లో మాస్ ఎలిమెంట్స్ , కామిడీ అన్ని మిక్స్ చేశారు. మీరు కూడా ఒకసారి చూడండి: