Silk Smitha: నమ్మకపోతే మార్క్ ఆంటోనీ సినిమా చూడండి!

విభిన్న కథాంశాలతో సినిమాలు చేసుకుంటూ తమిళంలో స్టార్ హీరోగా వెలుగుతున్న హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నిజానికి తెలుగు రాష్ట్రానికి చెందిన వాడైనా తమిళనాడులో ఆయన చాలా ఫేమస్. వెరైటీ కథనంతో తాను నటిస్తోన్న తాజా చిత్రం మార్క్ ఆంటోనీ. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం తర్వలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది.

టైం ట్రావెల్ కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమాలో విశాల్ తో పాటు వెర్సటైల్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో ఇద్దరి కారణంగా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలోని చాలాపాత్రలు డబులు త్రిపుల్ రోల్స్ లో కనిపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ట్రైలర్ తోనే కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేయడంతో సినిమా పైన భారీగా అంచనాలు పెంచేశారు మూవీ మేకర్స్.

ముఖ్యంగా ఈ చిత్రంలో సిల్క్ స్మిత (Silk Smitha) కనిపించింది. ఏంటి ఆమె చనిపోయింది కదా అనుకుంటున్నారా. ఆమెలా ఉండే ఒక అమ్మాయిని చూపించడంతో నిజంగానే ఈమె సిల్క్ స్మిత అనేలా అందరూ ఆశ్చర్యపోయారు. సిల్క్ స్మిత పాత్రను విష్ణు ప్రియ గాంధీ అనే అమ్మాయి చేసింది. నిజానికి ఆమె సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌. ఆమెను ఫాలో అయ్యేవారు జూనియర్ సిల్క్ స్మిత అని ముద్దుగా పిలుస్తూ ఉంటారట.

సిల్క్ స్మితాను అచ్చుగుద్దినట్టుండడమే కాకుండా తన హావ భావాలు డ్రెస్సింగ్ స్టైల్ కూడా అలాగే మెయింటైన్ చేస్తుంది. అందుకే విష్ణుప్రియను సిల్క్ స్మిత పాత్రకు గాను తీసుకున్నట్లు సమాచారం. ఇక విశాలే ఆమెను ఏరికోరి ప్రత్యేకంగా ఎంపిక చేయించినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్న ఈ సినిమాతో జూనియర్ సిల్క్ స్మిత క్రేజీ ఏవిధంగా మారుతుందో చూడాలి.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus