విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా కృష్ణ చైతన్య (Krishna Chaitanya) డైరెక్షన్ లో తెరకెక్కిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) సినిమా ఎన్నో ఆవాంతరాలను దాటుకుని ఈ నెల 17వ తేదీన థియేటర్లలో విడుదలవుతోంది. చిన్న సినిమాలతో, మిడిల్ రేంజ్ సినిమాలతో వరుస విజయాలు సాధిస్తున్న సితార నిర్మాతలు ఈ సినిమాతో సైతం మరో హిట్ అందుకుంటారని అభిమానులు భావిస్తున్నారు. దాస్ కా ధమ్కీ(Das Ka Dhamki) , గామి (Gaami) విజయాల తర్వాత విశ్వక్ సేన్ నటించి రిలీజవుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.
ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఏకంగా 14 కోట్ల రూపాయలకు ఈ సినిమా హక్కులను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు సమాచారం. కొన్ని రోజుల క్రితం తండేల్ హక్కులను 40 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన నెట్ ఫ్లిక్స్ తెలుగు సినిమాల హక్కులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.
పుష్ప ది రూల్, దేవర సినిమాల డిజిటల్ హక్కులు సైతం ఈ ఓటీటీ సొంతమయ్యాయి. నెట్ ఫ్లిక్స్ తెలుగు సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది. ఈ మధ్య కాలంలో ఓటీటీ మార్కెట్ పడిపోయిందని తరచూ వార్తలు వినిపిస్తుండగా ఇలాంటి సమయంలో తెలుగు సినిమాల డిజిటల్ రైట్స్ మాత్రం భారీ మొత్తానికి అమ్ముడవుతున్నాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో విశ్వక్ సేన్ రేంజ్ పెరుగుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
సినిమా సినిమాకు మార్కెట్ ను పెంచుకుంటున్న విశ్వక్ సేన్ భవిష్యత్తులో మరిన్ని భారీ విజయాలను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విశ్వక్ సేన్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ నెల 17వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ కోసం విశ్వక్ సేన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విశ్వక్ సేన్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు.