Shah Rukh Khan: షారూఖ్ రెస్టారెంట్ కు వెళ్లాలి అంటే ఆ కండిషన్ ఫాలో అవ్వాల్సిందేనా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు షారుక్ ఖాన్ ఒకరు. ఈయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో షారుక్ ఖాన్ నటించిన సినిమాలన్నీ కూడా వేయ్యికోట్ల కలెక్షన్లను సాధిస్తూ సంచలనాలను సృష్టిస్తున్నాయి. షారుక్ ఖాన్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఒక విషయంలో మాత్రం భార్య మాటే వినాల్సి ఉంటుంది అంటూ తాజాగా షారుక్ ఖాన్ కి సంబంధించినటువంటి ఒక వార్త వైరల్ గా మారింది.

మరి ఏ విషయంలో గౌరీ షారుక్ ఖాన్ కి కండిషన్ పెట్టారు అనే విషయానికి వస్తే గౌరీ ఖాన్ వృత్తిపరంగా ఇంటీరియర్ డిజైనర్ అనే సంగతి మనకు తెలిసిందే. ఈమె ముంబైలో పెద్దపెద్ద ప్రాజెక్టులను చేస్తూ ఉంటారు. అంతేకాకుండా గౌరీ ఖాన్ పలువురు బాలీవుడ్ స్టార్ ఇంటికి కూడా ఈమె ఇంటీరియర్ డిజైనర్ గా చేశారు. అంతేకాకుండా ముంబైలోని పలు రెస్టారెంట్లకు కూడా ఈమె డిజైనర్ గా పనిచేశారు.

ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ ముంబైలో ఏదైనా రెస్టారెంట్ కు వెళ్తే కనుక ఈమె డిజైన్ చేసినటువంటి రెస్టారెంట్ కు మాత్రమే వెళ్లాలి అని కండిషన్లో పెడతారంటూ ఓ సందర్భంలో షారుక్ ఖాన్ ఈ విషయాన్ని తెలియజేశారు. బాలీవుడ్ బాద్ షాకే గౌరీ ఖాన్ ఇలాంటి కండిషన్స్ పెట్టారా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇక షారుక్ ఖాన్ (Shah Rukh Khan) సినిమాల విషయానికొస్తే ఈయన డంకీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరుసటి రోజున ప్రభాస్ సలార్ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఏ సినిమా మంచి సక్సెస్ అందుకుంటుందోనని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus