శాతకర్ణి హంగామా స్టార్ట్స్!!!
- January 9, 2017 / 07:12 AM ISTByFilmy Focus
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రతిష్టాత్మక 100వ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి మరో చరిత్రకు శ్రీకారం చుట్టనుంది…గతంలో టాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా విడుదల కానుంది…అదే క్రమంలో ఈ సినిమాకు ప్రత్యేకంగా స్పెషల్ ప్రివ్యూ ఇద్దరు ‘ముఖ్య’అతిధులు వస్తున్నారట…..ఇంతకీ ఎవరా అతిధులు ఏమా కధ అంటే…..ఈ కధ చదవాల్సిందే….విషయంలోకి వెళితే…నందమూరి బాలకృష్ణ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ స్పెషల్ ప్రివ్యూ షోకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు బాలయ్య సినిమా చూడటంలో ప్రత్యేకత ఏమీ లేదు కానీ.. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ షోకు హాజరు కానుండటం విశేషం. బాలయ్య మొన్నే మర్యాదపూర్వకంగా కేసీఆర్ ను కలిసి తన సినిమా ప్రదర్శనకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
అయితే సినిమా మొదలు పెట్టిన రోజే కేసీఆర్ బాలయ్యను తనకు స్పెషల్ షో కావాలి అని అడగడంతో ఆ ఏర్పాట్లను పక్కాగా ప్లాన్ చేశాడు బాలయ్య, అయితే ఈ షో కి ఎవరెవరు వస్తారు అంటే…కేసీఆర్ కుటుంభం నుంచి కేసీఆర్, కేటీఆర్, కవిత కాగా, ఇటు చంద్రబాబు కుటుంభం నుంచి సతీమణి భువనేశ్వరి.. కొడుకు లోకేష్.. కోడలు బ్రహ్మణి.. మనవడు దేవాన్ష్ లతో కలిసి ఈ షోకు వస్తారని సమాచారం. మొత్తానికి ఓ సినిమా ప్రదర్శనకు చంద్రబాబు.. కేసీఆర్ తమ కుటుంబాలతో కలిసి హాజరవడం విశేషమే. ఏది ఏమైనా….బాలయ్య చరిత్రలో నిలిచిపోయేలా శాతకర్ణి లాంటి గొప్ప చక్రవర్తి కథతో సినిమా చేయడం నిజంగా యావత్ తెలుగు ప్రపంచం గర్వించలసిన విషయం…మరి ఈ సినిమా ఎలాంటి చరిత్రకు శ్రీకారం చుడుతుందో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















