మన ఇండియాలో మోస్ట్ సెన్సిబుల్ ఫిలిమ్ మేకర్స్ లిస్ట్ ఒకటి తయారు చేస్తే అందులో టాప్ టెన్ లో ఒకరిగా నిలుస్తారు గౌతమ్ వాసుదేవ్ మీనన్. ఆయన్ తెరకెక్కించే చిత్రాలే కాదు ఆయన వ్యవహారశైలి కూడా చాలా సెన్సిబుల్ గా ఉంటుంది. ప్రేమను, ప్రేమకథలను ఆయన హృద్యంగా తెరకెక్కించే తీరుకి తెలుగు, తమిళ రాష్ట్రాల్లో భారీ స్థాయి అభిమానులున్నారు. ఎలాంటి సందర్భాన్నైనా సహజంగా తెరకెక్కించగల దర్శకుడు గౌతమ్. ముఖ్యంగా హ్యూమన్ ఎమోషన్స్ ను ఆయన ఎలివేట్ చేసినంత సింపుల్ & రియలిస్టిక్ గా మరో దర్శకుడు చేయలేదు అనేది ఒప్పుకోవాల్సిన నిజం.
అందుకే.. కరోణా & లాక్ డౌన్ కారణంగా ఇండియా ఎదుకొన్న సమస్యలు, ప్రజలు పడిన బాధలు, కరోనాను భారత్ ఎలా ఎదుర్కొంటోంది అనే విషయం మీద ఒక డాక్యుమెంటరీ తెరకెక్కించాలని డిసైడ్ అయిన డిస్కవరీ చానల్ ఈ బాధ్యతను గౌతమ్ మీనన్ కు అప్పజెప్పింది. ఆయన త్వరలోనే ఈ డాక్యుమెంటరీ షూటింగ్ మొదలెట్టనున్నారు. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన “క్వీన్” వెబ్ సిరీస్ చూసిన ఫారిన్ బృందం..
ఆ సిరీస్ ను నిజాయితీగా తెరకెక్కించిన విధానం చూసి గౌతమ్ మీనన్ మేకింగ్ నచ్చి ఈ బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఈ డాక్యుమెంటరీలో భారత ప్రభుత్వం మొదట చూపిన గాంభీర్యంతోపాటు.. ప్రస్తుతం చూపుతున్న అలసత్వాన్ని కూడా హైలైట్ చేయనున్నారని సమాచారం.
Most Recommended Video
ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!