బిగ్ బాస్ హౌస్ లో 13వ వారం నామినేషన్స్ రచ్చలేపాయి. యాక్టివిటీ రూమ్ లో నరకం సెట్ వేసిన బిగ్ బాస్ రక్తంలాంటి పెయిటింగ్ పూసి మరీ నామినేట్ చేయాలని చెప్పాడు. దీంతో నామినేషన్స్ ఆసక్తిని కలిగించాయి. ఎప్పుడూ కూడా గౌతమ్ వర్సెస్ శివాజీ పాయింట్స్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇస్తున్నట్లుగానే ఇప్పుడు కూడా అదే విధంగా జరిగింది. అయితే, లైవ్ లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాడు గౌతమ్. అలాగే శివాజీ వాటికి కౌంటర్స్ వేశాడు. గౌతమ్ శివాజీని నామినేట్ చేశాడు. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ అప్పుడు అమర్ తో మాట్లాడుతూ ఎప్పడెప్పటివో మీరు తీసి మాట్లాడారు కదా.
మీ మనసులో ఆ పాయింట్స్ ఎలాగైతే పోవట్లేదో, అలాగే నాకు కూడా మీ గురించి ఎప్పడెప్పటివో అలాగే ఉండిపోయాయ్ అంటూ ఎగ్జాంపుల్ చెప్పాడు. నిజానికి గౌతమ్ ఫస్ట్ నుంచీ ఒక పాయింట్ బాగుందని అర్జున్ చెప్పాడు. అదే పాయింట్ ని మార్చి మమార్చి శివాజీపై అస్త్రంలా వాడుతూ అశ్వత్ధామ లాగా వదులుతూనే ఉన్నాడు. అదేంటంటే., అమర్ నామినేషన్స్ అప్పుడు ఎమోషనల్ అవుతున్నాడు, అరుస్తున్నాడు, గట్టిగట్టిగా కేకలు వేస్తున్నాడని నామినేట్ చేశారు. మరి పల్లవి ప్రశాంత్ కూడా అలాగే చేస్తున్నాడు కదా, అది మీకు కనిపించడం లేదా అంటూ గౌతమ్ ఎత్తిచూపాడు.
దీనికి శివాజీ కౌంటర్ కూడా ఇచ్చాడు. ఇదే మాట అస్తమానం చెప్తూ నామినేట్ చేస్తున్నావా అని అడిగాడు. ఇక్కడే యావర్ కి మీరు సపోర్ట్ చేస్తారు. పల్లవి ప్రసాంత్ కి చేస్తారు. వారి తప్పులు కనిపించవ్. ఎలాగైతే మీ కంఫోర్ట్ జోన్ లో మీరు వాళ్లని ప్రేమిస్తారో, అలాగే మాకు కూడా ఉంటుందని చెప్పాడు. ఇక శివాజీ తనదైన స్టైల్లో గౌతమ్ మాటలని తిప్పికొట్టాడు. వ్యతిరేకించాడు. నీకు అలా అనిపిస్తోందని అన్నాడు. ఆ తర్వాత శివాజీ గౌతమ్ ని తిరిగి నామినేట్ చేస్తూ లాక్ చేశాడు. కెప్టెన్సీ టాస్క్ అప్పుడు నువ్వు అమర్ ని ఎందుకు తీస్కుని వెళ్లావ్. నన్ను తీస్కుని వెళ్లచ్చు కదా అన్నాడు.
అక్కడ అమర్ ఫోటో రాకూడదని వెళ్లావ్. అదే నన్ను తీస్కుని వెళ్లుంటే అక్కడే డిసైడ్ అయ్యేది. అమర్ ని సేఫ్ అయ్యేవాడు. కెప్టెన్ అయ్యేవాడని చెప్పాడు. నువ్వు సేఫ్ గేమ్ ఆడావ్. నువ్వు సూప్ లో పడకూడదని ఆడావ్ అన్నాడు. ఇదే నాగ సర్ వీకెండ్ చెప్పారని గుర్తు చేశాడు. నిజానికి ఈ పగ ఇప్పటిది కాదు. గౌతమ్ అశ్వత్ధామ 2.ఓ అంటూ కమ్ బ్యాక్ ఇచ్చినప్పటి నుంచీ శివాజీనే టార్గెట్ చేస్తున్నాడు. చిన్న చిన్న నిక్కర్లు వేసుకుంటున్నారు అన్నాడు, ఇన్ని సినిమాలు చేశారు కానీ మీ అనుభవం ఏమైందని ప్రశ్నించాడు. ఇలా చాలా విషయాల్లో శివాజీతో వాదన పెట్టుకుంటునే ఉన్నాడు.
ముఖ్యంగా నామినేషన్స్ అప్పుడు వీరిద్దరి ఆర్గ్యూమెంట్స్ అనేవి పీక్స్ కి వెళ్లిపోతాయ్. ఇక ఆడియన్స్ మీతోనే ఉన్నారా.. మాతో లేరా.. నాకు కెప్టెన్ చేశారని మీరు అందరికీ కలర్ ఇచ్చారు. యు జడ్జిమీ బై లైక్ కవర్.. కానీ నేను అది కాదు. అంటూ గౌతమ్ శివాజీని మాట్లాడనివ్వలేదు. ప్రతి ఒక్కరూ చూస్తారు. ఈ పాయింట్ కోసం నేను వెయిటింగ్. అని గౌతమ్ అంటే, ప్రతివారం ఇదే చెప్తున్నావ్ నీ దగ్గర పాయింట్స్ లేవ్, వాంటెడ్ గా గొడవ పెట్టుకుంటున్నావ్ అంటూ చెప్పాడు శివాజీ. అంతేకాదు, హైపర్ ఆది వచ్చి చెప్పింది మరోసారి గుర్తుచేశాడు. అలాగే నాకు ఎలాంటి ద్వేషం కూడా లేదు.
నువ్వు చెప్పిన పాియింట్స్ వాలిడ్ లేవ్. వాంటెండ్ గా తెచ్చిపెట్టుకున్నట్లుగా ఉన్నాయ్. అనే క్లారిటీ ఇచ్చాడు. అలాగే, గౌతమ్ కూడా మీ చుట్టూ ఉన్నవాళ్లు తప్పు చేస్తే మీకు కనిపించదు అనే పాయింటే బాగా బలంగా పట్టుకున్నాడు. గౌతమ్ లేని పోని పాయింట్స్ తో కావాలనే శివాజీని టార్గెట్ చేస్తున్నాడు. ఇక్కడ చెప్పిందే చెప్పడం అనేది అలవాటు అయిపోయింది. ఇలా ఒక పాయింట్ ఉంటే దాన్ని స్ట్రయిట్ గా ఎప్పుడూ గౌతమ్ చెప్పడు. ఎగ్జాంపుల్స్ ఎప్పుడైతే తీస్కుంటాడో అప్పుడు అది పక్కదోవ పట్టేస్తుంది.
నామినేషన్స్ లో (Bigg Boss 7 Telugu) కూడా యావర్ డాక్టర్ గురించి చేసిన కామెంట్స్ పై మీరు స్పందించలేదని పాత విషయాన్ని తవ్వాడు. దానికి యావర్ ఫీల్ అయ్యాడు. వచ్చి గౌతమ్ ని ఇదే పాయింట్ పై నామినేషన్ చేశాడు. మొత్తానికి శివాజీ వర్సెస్ గౌతమ్ ఇద్దరూ కూడా పాత విషయాలపైనే ఫోకస్ పెట్టారు. నామినేషన్స్ లో మరోసారి టామ్ అండ్ జెర్రీ ఫైట్ ని చూపించారు. అదీ మేటర్.
ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!
కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!