Gayatri Gupta: నటి గాయత్రి గుప్తా.. షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ నటి గాయత్రి గుప్తా అందరికీ సుపరిచితమే.! ఫిదా సినిమాలో సాయి పల్లవి స్నేహితురాలిగా కనిపించిన ఈ అమ్మడు ఆ తర్వాత ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, ‘మిఠాయి’, ‘కొబ్బరి మట్ట’ వంటి సినిమాలు చేసి మెప్పించింది. ఆ సినిమాల్లో తన హానెస్ట్ పెర్ఫార్మన్స్ తో మంచి మార్కులు వేయించుకుంది ఈ నటి. ఇదిలా ఉండగా.. గాయత్రీ గుప్తా గురించి ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. గాయత్రి గుప్తా ఓ వ్యాధితో తీవ్రంగా బాధపడుతుందట.

పూర్తి వివరాల్లోకి వెళితే.. యాంక్లోసింగ్ అనే ఓ వ్యాధితో ఆమె తీవ్రంగా బాధపడుతుందట. ఈ వ్యాధి వల్ల మనిషి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు అని సమాచారం. (Gayatri Gupta) గాయత్రి గుప్తా.. ఈ వ్యాధితో చాలా కాలంగా ఇబ్బందులు పడుతుందట. కానీ ఎప్పుడు వ్యాపించింది అనేది ఆమెకు తెలీదట. ఈ వ్యాధి వల్ల పెయిన్ కిల్లర్స్ ని వాడుతుంటుందట. ఆ టైంలో గుండె దడ కూడా వచ్చేదని, చావే సుఖం అనే ఆలోచనలు ఆ టైంలో వస్తాయని ఆమె తేలింది.

ఆమెతో (Gayatri Gupta) వైద్యులు కూడా నువ్వు 3 ఏళ్ళకి మించి బ్రతకవు అని చెప్పినట్టు కూడా తెలిపి ఈమె పెద్ద షాకిచ్చింది. కానీ సైకాలజీ థెరపీ ట్రీట్మెంట్ తీసుకోవడంతో కొంచెం బాగుందని, అలాగే టైంకి నిద్రపోవడం, ఉదయాన్నే యోగా చేయడం మొదలైనవి పాటించడం వల్ల జీవితం మీద ఆశ పెరిగినట్టు ఆమె ఎమోషనల్ కామెంట్స్ చేసింది. అయితే సినిమా పై ఉన్న పిచ్చితో ఆమె త్వరగానే నార్మల్ అయినట్టు కూడా ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus