రోడ్డు ప్రమాదంలో గీతా సింగ్ కుమారుడు మృతి.. ఎమోషనల్ పోస్ట్ చేసిన కరాటే కళ్యాణి!

తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో పేరు సంపాదించుకున్న నటి గీతా సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె అల్లరి నరేష్ హీరోగా నటించిన కితకితలు సినిమాలో ఆయన పక్కన హీరోయిన్గా నటించారు. ఈ సినిమా ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న గీత అనంతరం పలు సినిమాలలో లేడీ కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించే సందడి చేశారు.

ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు 32 సినిమాలలో నటించి మెప్పించిన ఈమె ప్రస్తుతం అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇలా అవకాశాల కోసం ఎవరిని అడగలేక ఒకవేళ అవకాశాలు వచ్చిన రెమ్యూనరేషన్ అడగలేక ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు కూడా తనకు ఎదురయ్యాయని పలు సందర్భాలలో తెలియజేశారు.

ఇకపోతే గీత ఇప్పటివరకు వివాహం చేసుకోలేదు ఈమె తన అన్నయ్య మరణించడంతో తన అన్నయ్య పిల్లలను దత్తత తీసుకొని వారి బాగోగులన్నింటిని కూడా గీతా సింగ్ చూసుకుంటున్నారు. ఇలాగీత సింగ్ దత్తపుత్రుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈమె ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ఈ క్రమంలోనే కరాటే కళ్యాణి స్పందిస్తూ పిల్లలు దయచేసి రోడ్డుపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. అది కారు అయినా బైక్ అయినా. కమెడియన్ గీత సింగ్ కుమారుడు మరణించారు ఓం శాంతి అంటూ ఈమె గీతా సింగ్ కుమారుడు ప్రమాదంలో మరణించిన విషయాన్ని తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇక ఈ విషయం తెలిసినటువంటి నేటిజన్స్ గీతా సింగ్ కుటుంబానికి సంతాపం ప్రకటిస్తున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus