Girija Shettar: మణిరత్నం హీరోయిన్ ఇపుడేం చేస్తుందంటే..?

టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ ప్రేమ కథా చిత్రాల్లో ‘గీతాంజలి’ ముందువరసలో ఉంటుంది. 1989లో విడుదలైన ఈ సినిమా జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. అంతేకాకుండా మణిరత్నం ఇప్పటివరకు దర్శకత్వం వహించిన తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. నాగార్జున, గిరిజ జంటగా నటించిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అందుకుంది. అయితే ఈ సినిమా తరువాత గిరిజ తెలుగులో ఎక్కడా కనిపించలేదు. గిరిజ పూర్తి పేరు గిరిజా ఎమ్మా జేన్ షెత్తార్.

తన పద్దెనిమిదవ ఏటనే భరతనాట్యం నేర్చుకున్న గిరిజ.. క్రికెటర్ శ్రీకాంత్ చెల్లెలితో కలిసి మణిరత్నం, సుహాసినిల పెళ్లికి గిరిజ కూడా హాజరైంది. పెళ్లిలో గిరిజను చూసిన మణిరత్నం తన సినిమాలో హీరోయిన్ గా నటించమని కోరడంతో ఆమె వెంటనే ఒప్పుకుందట. తెలుగులో గిరిజ నటించిన ఒకే ఒక్క సినిమా ‘గీతాంజలి’. ఈ ఒక్క సినిమాతోనే ఆమె భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. కళ్లతోనే హావభావాలు పలికించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.

అదే సమయంలోనే మలయాళంలో కొన్ని చిత్రాలు కూడా పూర్తి చేసింది. ఆ తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పేసిన గిరిజ ప్రస్తుతం లండన్ లో రైటర్ గా సెటిల్ అయింది. 2005 నుంచి ఆరోగ్య సంబంధాలపై జర్నలిస్ట్ గా పని చేస్తోంది.

1

2

3

4

5

6

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus