గీతా మాధురి (Geetha Madhuri).. పరిచయం అవసరం లేని పేరు. మాస్ సాంగ్స్ పాడుతూ ఈమె టాప్ సింగర్ గా ఎదిగింది. ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా అడుగుపెట్టి రన్నర్ గా నిలిచింది. ‘బిగ్ బాస్’ షోతో గీత మంచి పేరే సంపాందించుకుంది. ఆ క్రేజ్ తో ఈమె సినిమాల్లోకి అడుగుపెడుతుందేమో అని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. గీత అలాంటి ప్రయత్నాలు చేయకుండా తన సింగర్ పని ఏదో తాను చేసుకుంటుంది.
అలాగే పలు సింగింగ్ షోలకి కూడా మెంటర్ గా వ్యవహరిస్తూ వస్తోంది. ఇక సోషల్ మీడియాలో గీత చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె పెట్టే పోస్టులు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. ఇటీవల ఆమె పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. గీతా మాధురి తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా స్పందిస్తూ.. “మనం బాధలో ఉన్నా.. ఆనందంలో ఉన్నా షేర్ చేసుకోవడానికి ఎవరైనా ఉంటే బాగుణ్ణు అని అనుకుంటాం.
అప్పుడు మనకు తెలియకుండా ఒకరి ట్రాప్లో పడిపోయే అవకాశం ఉంటుంది. మన అటెన్షన్ డ్రా చేయడానికి మరొకటి అవకాశం దొరుకుతుంది. అప్పుడు తెలీకుండానే వాళ్ళు మన మైండ్ ని పొల్యూట్ చేసే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే మనం ఎలా ఉంటున్నామో.. ఎవరితో ఉంటున్నామో.. ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నామో..
ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని జాగ్రత్తగా ఉండాలి. మనల్ని చెడగొట్టాలి అనుకునే మిత్రుల కన్నా.. జాగ్రత్తగా ఉండటం నేర్పే శత్రువే చాలా బెటర్” అంటూ చెప్పుకొచ్చింది. ఆమె ఎవరి గురించి ఈ పోస్ట్ పెట్టింది? అనే డౌట్స్ అందరికీ ఉన్నప్పటికీ.. ఆమె చెప్పిందాంట్లో లాజిక్ ఉంది కాబట్టి.. చాలా మంది ‘సూపర్ మేడమ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.