బిగ్ బాస్ హౌస్ లో అడవిలో ఆట అనే టాస్క్ నడుస్తోంది. ఈ టాస్క్ లో భాగంగా గార్డెన్ ఏరియా అంతా అడవిలాగా మార్చాడు బిగ్ బాస్. ఈ అడవిలో రెడ్ ట్యాగ్ ఉన్న బొమ్మలని దొంగల టీమ్ దొంగలించి అత్యాశ గల వ్యాపారి అయిన గీతురాయల్ కి అమ్మాలి. ఇక్కడ గీతు రాయల్ బొమ్మలని ఎంతకైనా కొనొచ్చు. దొంగలతో బేరాలు ఆడచ్చు. ఈ దొంగతనం చేసేటపుడు పోలీసులు దొంగలని పట్టుకోవాల్సి ఉంటుంది. రెడ్ లైన్ దాటేలోపు, రెండో సౌండ్ వచ్చేలోపు పోలీసులు పట్టుకోవాలి.
లేదంటే వాళ్లు పారిపోతారు. అలాగే, పోలీసులకి ఇంట్లో సోదాలు చేసే అవకాశం కూడా కల్పించాడు బిగ్బాస్. పోలీస్ విజిల్ వచ్చినపుడు ఈ రైడ్ ని కొనసాగించాలి. మరో విజిల్ వచ్చేవరకూ యధేచ్ఛగా రైడ్ చేస్కోవచ్చు. ఈ టాస్క్ లో గీతు కొద్దిగా అతి చేసిందా అనిపించింది. ఎందుకంటే, దొంగల దగ్గర్నుంచీ బొమ్మలని మాత్రమే కొనాలి. కానీ, గీతు కొన్ని బొమ్మలని దొంగతనం చేసి తన దగ్గర పెట్టుకుంది. ఈ టాస్క్ లో నిజానికి అత్యాశ గల వ్యాపారి అయిన గీతు బాల్కనీలో సదుపాయాలని అనుభవిస్తూ బెల్ సౌండ్ వచ్చినపుడు మాత్రమే వ్యాపారా లావాదేవీలు కొనసాగించాలి.
మళ్లీ బెల్ సౌండ్ కి దీన్ని ముగించాలి. ఇక్కడ దొంగల దగ్గర్నుంచీ వచ్చిన బొమ్మల ద్వారా మాత్రమే తను కెప్టెన్సీ పోటీదారులుగా ఉండచ్చు. కానీ, గీతు తెలివిగా అడవిలోకి వెళ్లి బొమ్మలని కొట్టేసింది. దొంగలకంటే ముందే కొన్ని బొమ్మలని చేజిక్కించుకుంది. దీంతో హౌస్ మేట్స్ ఫ్రస్టేషన్ కి గురి అయ్యారు. అసలు బొమ్మలని నువ్వు పట్టుకోకూడదని అబ్జక్షన్ చేశారు. పోలీసుల నాయకుడు అయిన ఆదిరెడ్డి గీతుతో కాసేపు ఆర్గ్యూమెంట్ చేశాడు.
కానీ, గీతు వినిపించుకోలేదు. ఫైనల్ గా బెల్ సౌండ్ వచ్చినపుడు శ్రీహాన్ గీతుతో బేరాలు ఆడాడు. ఫస్ట్ బొమ్మ ఎవరైతే అమ్ముతారో వారికి నా దగ్గర ఉన్న బొమ్మలని ఇచ్చేసి నేను కొనుక్కుందాం అనుకున్నాను అంటూ తన అతి తెలివిని బయట పెట్టింది. దీంతో హౌస్ మేట్స్ ఇది అన్ ఫెయిర్ అంటూ మాట్లాడారు. అయినా కూడా గీతు తను అనుకున్నది మాత్రమే చేసింది. ఈ టాస్క్ లో దొంగల టీమ్ నాయకుడిగా ఉన్న సూర్య కాసేపు జైల్లో ఉండటం వల్ల గీతుతో జరిగిన వ్యాపారా లావాదేవీలు మిస్ అయ్యాడు.
శ్రీహాన్ ని చూసిన రేవంత్ తన బొమ్మలని కూడా గీతు కి ఇచ్చేశాడు. అలాగే, నేహా కూడా తన దగ్గర ఉన్న బొమ్మని గీతుకి అమ్మేసింది. దీంతో గీతు దగ్గర మొత్తం 13 బొమ్మలు వచ్చాయి. మొత్తం 25బొమ్మలని గీతు దొంగల నుంచీ కొనాలి. మరి ఈరోజు ఆటలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరం. అదీ మేటర్.