Geetu: బిగ్ బాస్ సెట్ ని వదలి వెళ్లనని ఎమోషనల్ అయిన గీతు..! స్టేజ్ పైన జరిగింది ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం ఎలిమినేషన్ ఘట్టం అత్యంత నాటకీయంగా జరిగింది. చివర్లో శ్రీసత్య ఇంకా గీతు ఇద్దర్నీ ఉంచిన బిగ్ బాస్ కాసేపు వాళ్ల ఎమోషన్ తో ఆడుకున్నాడు. హౌస్ మేట్స్ అందరూ గీతుని ఓదార్చే ప్రయత్నం చేస్తుంటే, మీరు నన్ను ఏడిపించద్దు. నేను వెళ్లను అంటూనే ఏడుపు మొదలుపెట్టింది. మరోవైపు శ్రీసత్య ఏడుస్తుంటే శ్రీహాన్ ఓదార్చే ప్రయత్నం చేశాడు. నిజానికి హౌస్ మేట్స్ లో ఎవరూ కూడా గీతు చివరి వరకూ ఉంటుందని ఊహించలేదు. ఆదిరెడ్డి కూడా గీతు వెళ్లిపోతుందని అస్సలు అనుకోలేదు.

కానీ, అనూహ్యంగా హోస్ట్ నాగార్జున గీతు ఎలిమినేట్ అని, శ్రీసత్య సేఫ్ అని చెప్పేసరికి హౌస్ లో ఒక్కసారిగా అందరూ ఖంగుతిన్నారు. ఫైమా అయితే శోకాలు పెట్టింది. రేవంత్ సైతం కళ్లనీళ్లు పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. గీతు ఎలిమినేట్ అవ్వగానే తన ఫేవరెట్స్ ప్లేస్ లలో కాసేపు కూర్చుని మరీ బయటకి వచ్చింది. ఇక గేటు తీసేటపుడు నేను బిగ్ బాస్ వదలి వెళ్లను అని, నాకు బిగ్ బాస్ అంటే ఎంతిష్టమో మీకు తెలీదని చెప్తూ కెమెరాకి ముద్దుపెట్టింది. బిగ్ బాస్ వద్దు బిగ్ బాస్ అంటూ ఏడుస్తూనే నాగార్జున దగ్గరకి స్టేజ్ పైకి వచ్చింది.

ఇక నాగార్జున జెర్నీ చూద్దాం అనేసరికి అసలు తట్టుకోలేకపోయింది. నిజానికి గీతుకి ఎలిమినేషన్ ప్రోసెస్ ఎలా ఉంటుందో తెలుసు. సీక్రెట్ రూమ్ కి పంపించారా అనే అనుమానం హౌస్ మేట్స్ కి వచ్చింది. కానీ, స్టేజ్ పైన గీతుని చూసేసరికి అందరికీ కన్ఫార్మ్ అయ్యింది. ఇక హౌస్ మేట్స్ ని పలకరిస్తూ బాగా ఎమోషనల్ అయిపోయింది. అందరిలో తనకి సూపర్ అన్నవాళ్లని ట్యాగ్ ఇచ్చింది. రేవంత్, శ్రీహాన్, ఫైమా, ఆదిరెడ్డిలని సూపర్ అంటూ పొగిడింది. మిగిలిన వాళ్లు ఇంకా గేమ్ లో బాగా ఆడాలని చెప్పింది.

ఇక బాలాదిత్య నాకు బ్రదర్ అని చెప్పింది గీతు. బాలాదిత్య, రేవంత్, ఫైమా, శ్రీసత్య, శ్రీహాన్, ఆదిరెడ్డి ఇలా అందరూ గీతుని చూస్తూ ఏడుస్తూ ఉండిపోయారు. ఇక రేవంత్ పాట పాడుతుంటే స్టేజ్ పైన ఏడుస్తూ కూర్చుండిపోయింది గీతు. నాగార్జున యాంకరింగ్ చేస్తూ బై బై చెప్తున్నప్పుడు నాగార్జునని పట్టుకుని మరీ ఏడ్చేసింది. నేను వెళ్లను, వెళ్లను అంటూ చిన్నపిల్లలా చాలాసేపు మారం చేసింది. దీంతో బిగ్ బాస్ స్టాఫ్ వచ్చి గీతుని తీస్కుని వెళ్లారు.

ఇక స్టేజ్ వెనక్కి వెళ్లిన తర్వాత కూడా గీతు తన ఎలిమినేషన్ ని నమ్మలేదు. బిగ్ బాస్ హౌస్ లో ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతానని ఊహించలేదని, ఫినాలే వరకూ ఉంటానని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నానంటూ చెప్పింది గీతు. ఏది ఎక్కడ రాంగ్ అయ్యిందో తెలియడం లేదని నాగార్జునతో మొరపెట్టుకుంది. బిగ్ బాస్ సీజన్ 6 లో అత్యంత నాటకీయంగా, రసవత్తరంగా గీతు జెర్నీ ముగిసింది. అదీ మేటర్.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus