బిగ్ బాస్ హౌస్ లో గలాటే గీతు ఓవర్ యాక్షన్ కి, నోటికి హద్దు లేకుండా పోతోంది. ముఖ్యంగా నాగార్జున గతవారం పొగిడేసరికి ఆకాశంలో విహరిస్తోంది గీతు. మీరు నా గేమ్ ని ఇంకా 20 శాతమే చూశారని ఇంకా చూపిస్తానంటూ చెప్పింది. ఇదే ఉత్సాహంతో గేమ్ లో మంచితనం పనికిరాదు అన్న బాలాదిత్యకి గీతోపదేశం చేసేందుకు ప్రయత్నింంచింది. అందరికీ ప్రవచనాలు చెప్పడం మానేయ్ అని, గేమ్ లో పవర్ చూపించమని నాగ్ బాలాదిత్యకి స్ట్రాంగ్ గా చెప్పాడు. దీంతో గీతు ఆదిత్యకి సలహాలు ఇచ్చింది. ” ప్రపంచంలో అందరూ రిచ్ అనుకో పనులు ఎవరు చేస్తారు.
బాత్రూమ్ లు ఎవరు కడుగుతారు ? చెప్పులు ఎవరు కుడతారు ? బట్టలు ఎవరు కుడతారు, కాలవలు ఎవరు క్లీన్ చేస్తారు. అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చింది. ప్రపంచం అంతా రిచ్ క్యాండెట్స్ ఉండరు. అన్ని రకాల వాళ్లు ఉండాలా., అలాగే బిగ్ బాస్ హౌస్ లో సూపర్ కంటెస్టెంట్స్ ఉంటే, బయటకి ఎవరు పోతారు ? మనం ఎవరినీ సూపర్ కంటెస్టెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు అందరి దగ్గరకి వెళ్లి నెగిటివ్ ని పాజిటివ్ చేయాల్సిన అవసరమే లేదు.
బేసికల్లీ ప్రీచింగ్ అంటే అది అంటూ మాట్లాడింది. ఇక్కడ బాలాదిత్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా లేచి వెళ్లిపోయాడు. గీతు ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చిందో బాలాదిత్యకి అర్దమైంది. అందుకే , కాంట్రవర్సీ మాట్లాడకుండా ఉంటేనే బెటర్ అని అనుకుని వెళ్లిపోయాడు. ఇప్పుడు గీతు మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ప్రీచింగ్ అంటే ఏం చెప్తున్నావ్ అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. పనిచేసుకునేవాళ్లు అంటే అంత చులకనా అంటూ నిలదీస్తున్నారు. పేదవాళ్లని ఎదగనివ్వకూడదని ఎవరు చెప్పారని, ఈ ప్రపంచంలో ఏ పని ఎవరైనై చేసుకునే స్వేచ్ఛ ఉందని గీతుకి స్ట్రాంగ్ కామెంట్స్ పడుతున్నాయి.
పనులు చేసుకునేవాళ్లని ఆదుకోవాల్సిన అవసరమే లేదు అనే మీనింగ్ వస్తోందని, మనం ఎవరినీ సూపర్ కంటెస్టెంట్స్ గా అంటే రిచ్ గా చేయాల్సిన అవసరం లేదన్నట్లుగా గీతు మాట్లాడిందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఒకరి నెగిటివ్ ని అంటే ( పేదలని ) మార్చాల్సిన అవసరం లేదనే ఉద్దేశ్యం వచ్చిందని, ఆమె మాటలు ప్రవచనం అలాగే ఉందని సోషల్ మీడియాలో కొంతమంది ఫైర్ అవుతున్నారు.మరి ఇప్పుడు గీతు చేసిన కామెంట్స్ కి వీకండ్ నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఆసక్తిగా మారింది. ఈ ప్రీచింగ్ ఎక్కడివరకూ దారితీస్తుందనేది చూడాలి.