Geetu Royal: గీతు – చంటి వార్..! ఆ విషయం కావాలనే రేవంత్ కి చెప్పిందా..?

బిగ్ బాస్ హౌస్ లోకి యూట్యూబర్ గా , బిగ్ బాస్ రివ్యూవర్ గా ఎంట్రీ ఇచ్చింది గీతు. వచ్చిన దగ్గర్నుంచీ నెగిటివిటీని మూటగట్టుకుంది. కొంతమంది గీతు స్ట్రయిట్ గా మనసులో ఏది దాచుకోదు అని అంటుంటే, మరికొంత మంది అసలు గీతు మాటలకి అర్ధమే లేదని , అనవసరంగా నోటీ దూల చూపిస్తోందని అంటున్నారు. ఇక వచ్చిన మొదటి వారం నుంచీ గీతు చంటిని టార్గెట్ చేసింది. నామినేషన్స్ లో వీరిద్దరికీ వార్ నడించింది. ఆ తర్వాత కూడా టాస్క్ లలో చంటి పెర్ఫామెన్స్ ఏమీ లేదని ఎప్పటికప్పుడు గీతు చెప్తునే వచ్చింది.

చంటి కూడా గీతు గేమ్ ని, గీతు మాట్లాడే మాటల్ని ఎప్పటికప్పుడు ఎత్తి చూపిస్తునే ఉన్నాడు. నాలుగోవారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో బాక్సింగ్ గ్లౌజ్ ని దక్కించుకున్న చంటి గీతు ఫోటో కి పంచ్ ఇచ్చి పోటీ నుంచీ తప్పించాడు. దీంతో గీతు అగ్గిమీద గుగ్గిలం అయిపోయింది. ఆటరాని వాళ్లు కూడ నా ఆట గురించి కామెంట్స్ చేస్తున్నారని, కామెడీగా ఉందంటూ చంటిని రెచ్చగొట్టింది. దీంతో చంటి సీరియస్ అయ్యాడు. ఏ ఆట ఆడాలి ? నీకు తెలిసిన ఆట ఇదే..? నీకు చటాకు మాత్రమే తెలుసు అంటూ గీతుని రెచ్చగొట్టాడు.

దీంతో గీతు ఫైర్ అయ్యింది. ఇద్దరి మద్యలో చాలాసేపు ఆర్గ్యూమెంట్ అయ్యింది. ఈ ఆర్గ్యూమెంట్ తర్వాత చంటికి స్మోకింగ్ రూమ్ లో రేవంత్ గీతు గేమ్ గురించి చెప్పాడు. తనకి నీకు ఫస్ట్ వీక్ నుంచీ కోల్డ్ వార్ అనేది స్టార్ట్ అయ్యిందని అందుకే అలా చేస్తోందని అన్నాడు. అంతేకాదు, వాళ్లు గీతు కేవలం సీక్రెట్ టాస్క్ కోసమే అలా అని చెప్పిందని అభిప్రాయపడ్డారు. ఇక తర్వాత గీతు రేవంత్ కి చంటి అన్నమాటలు చెప్పింది.

చంటి నీ గురించి వెనకాల వెళ్లి మాట్లాడుతున్నాడని, వాడిని అలా వదిలేయకండ్రా.. ఎవరికైనా చూపిచండ్రా అనే డైలాగ్స్ కొడుతున్నాడని రేవంత్ ని రెచ్చగొట్టింది. కావాలనే చంటి గురించి రేవంత్ కి ఈవిషయాన్ని చెప్పిందా అనిపిస్తోంది. ఎందుకంటే, చంటిని ఎదుర్కోవడానికి రేవంత్ ని ఉసిగొల్పుతున్నట్లగానే ఉంది. అయితే, ఇక్కడ రేవంత్ ఏ విషయంలో అన్నాడు అంటూ క్లియర్ గా అడిగాడు. కానీ, బ్యాక్ బిచ్చింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అంటూ గీతు రేవంత్ కి పదే పదే ఫిర్యాదులా చెప్పింది.

నిజానికి అంతకుముందు గీతు తను హోటల్ టాస్క్ లో ఎవరిని అయితే నమ్మకం పెట్టుకున్నానో వాళ్లు నాకు డబ్బులు ఇవ్వలేదంటూ ఎమోషనల్ అయ్యింది. రాజ్ విషయంలో , బాలాదిత్య విషయంలో బాగా ఫీల్ అయ్యింది. ఇప్పుడు చంటి కూడా తనని కెప్టెన్సీ రేస్ నుంచీ తప్పించేసరికి తీసుకోలేకపోయింది. అందుకే, చంటి గురించి రేవంత్ కి చెప్తూ డబుల్ గేమ్ ఆడుతోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదీమేటర్.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus