Geetu, Inaya : నామినేషన్స్ లో నోరుజారిన గీతు..! రచ్చ చేసిన ఇనయ..!

బిగ్ బాస్ హౌస్ లో మూడోవారం నామినేషన్స్ లో హౌస్ మేట్స్ రెచ్చిపోయారు. ముఖ్యంగా గీతు బిహేవియర్ పై విరుచుపడ్డారు కొంతమంది. ఇందులో ఫస్ట్ శ్రీసత్య ఆరోహిని ఇంకా ఇనయని నామినేట్ చేసింది. ఆ తర్వాత గీతు గేమ్ మొదలుపెట్టింది. సుదీప, ఇంకా చంటి ఇద్దరినీ నామినేట్ చేసి ఫుల్ క్లాప్ పీకింది. ముఖ్యంగా సుదీపని ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ అని నన్ను అన్నారు కదా, టిష్యూస్ పడేయలేదని నాగ్ సర్ కూడా క్లాస్ పీకారు. మరి మీరు మొన్ని ఎమోషనల్ అయిపోయినపుడు గార్డెన్ ఏరియాలో నైట్ అంతా టిష్యూలు అలాగే వదిలేశారు.

అంతేకాదు, అవి మార్నింగ్ వరకూ అలాగే ఉన్నాయి. మరి దానికేమంటారు ? అంటూ కౌంటర్ వేసింది. అలాగే చంటిని కూడా నేను కట్ చేస్తే మీరు ఆలు కూర తినలేదని, అలాగే మీరు ఫుడ్ పెట్టేటపుడు వడ్డించేటపుడు పక్కనే నేను ఉన్నా కూడా నాకు వేయమని చెప్తున్నా కూడా పట్టించుకోలేదని నేను బాగా హర్ట్ అయ్యానని చెప్పింది గీతు. గీతు నామినేషన్స్ పూర్తి అయ్యాక గీతుని హౌస్ మేట్స్ లో సుదీప, చంటి, ఇనయ ఆట ఆడేసుకున్నారు. ముందు చంటి గీతుని నామినేట్ చేస్తూ నాకు కోపాన్ని ప్రదర్శించడం అలాగే తెలుసు అని చెప్పాడు.

అంతేకాదు, బయట నాకు ఈగో ఉన్నా కూడా బయటే పెట్టేసి హౌస్ లోకి ఆట ఆడేందుకు వచ్చానని చెప్పాడు. ఇక మద్యలో నేహాతో నామినేషన్స్ అప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని, ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోమని ఆల్రెడీ నేను గతవారం నామినేషన్స్ లో నీకు చెప్పానని అన్నాడు. అమ్మా, తల్లి , బంగారం అని చెప్తున్నా నీకు అర్ధం కావట్లేదు. నేను నీకు ఎలా చెప్పాలి అంటూ చంటి క్లాస్ పీకాడు. ఆతర్వాత ఇనయ సుల్తానా వచ్చి గీతుకి లెఫ్ట్ రైట్ క్లాస్ పీకింది. నువ్వు ఫెయిర్ గా గేమ్ ఆడట్లేదని స్ట్రయిట్ గా చెప్పింది.

కెప్టెన్సీ అప్పుడు రేవంత్ ని ఇన్ఫులెన్స్ చేసి రాజ్ కి ఓటు వేశావని అసలు కెప్టెన్ ని ఎలా ఎంచుకుంటారో నీకు తెలీదా అంటూ గీతుని లాక్ చేసింది. ఇక్కడ గీతు నా గేమ్ నా ఇష్టం.. నేను ఇన్ఫులెన్స్ చేస్తాను కానీ, మీరు అవ్వకూడదు , రాజ్ నాకు ఇష్టం కాబట్టే నేను కెప్టెన్ గా చూడాలని అనుకున్నాను. నేను రేస్ లో లేనపుడు నా ఫ్రెండ్ ఉండాలని కోరుకుంటాను అంటూ రీ కౌంటర్ వేసింది. ఆ తర్వాత ఇద్దరి మద్యలో చాలా మాటలు పెరిగాయి. ముఖ్యంగా ఇనయ తన ర్యాక్ ని తీస్కుని బట్టలు పెట్టుకున్నావ్, మరి నెక్ట్స్ వీక్ ఇస్తాను అన్నావ్ ఎందుకు ఇవ్వలేదు నువ్వు ఫేక్ అంటూ రెచ్చగొట్టింది.

అలాగే బెడ్ దగ్గర అస్సలు నీట్ నెస్ ఉండదని నీవల్లే లగ్జరీ బడ్జెట్ లో పాయింట్స్ తగ్గిపోయాయని సాలిడ్ ఆర్గ్యూ చేసింది. దీంతో గీతు ఇరిటేట్ అయిపోయింది. పో, చెప్పింది చాలు దొబ్బేయ్ అంటూ నోరు జారింది. ఇనయ కూడా మాటలకి మాట చెప్తూ నువ్వు కూడా దొబ్బేయ్ అని గీతుతో కలిసి రెచ్చిపోయింది. సుదీప వచ్చి గీతుని నామినేట్ చేస్తూ చాలా విషయాల్లో గట్టి క్లాస్ పీకింది. నేను ఒక ఎమోషనల్ లో ఉన్నప్పుడు మర్చిపోవడం అనేది సహజమని చెప్పింది.

నీకు కుక్కపిల్ల ఏదో వ్యాధి వచ్చి చనిపోతే ఎంత బాధపడ్డావో, అలాగే నా రక్తం నా బేబీ గురించి మాట్లాడేటపుడు నాకు అంతకంటే ఎక్కువ ఎమోషన్ వచ్చిందని అందుకే టిష్యూల విషయంలో అలా జరిగి ఉండచ్చని చెప్పింది. అంతేకాదు, నువ్వు ఏదైతే చెప్తావో అది అస్సలు చేయవని నీ సంస్కారం అంతే అని మాట్లాడింది. ఇప్పుడు ఇనయని దొబ్బేయ్ అంటూ మాట్లాడావ్ అదేనా నీ సంస్కారం అంటూ నిలదీసింది. ఇద్దరి మద్యలో చాలా సేపు ఆర్గ్యూమెంట్ అనేది అయ్యింది. అందరితో నువ్వు నెగిటివ్ అనిపించుకుంటే ప్రజలు నిన్ను నెత్తిన పెట్టుకోరని క్లియర్ గా చెప్పింది. ఈనామినేషన్స్ లో వీరిద్దరి మద్యలో ఆర్గ్యూమెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus