పదమూడేళ్ల క్రితం సినిమా.. ఇప్పుడు రిలీజ్ చేస్తారట!

టాలీవుడ్ లో కొన్నేళ్ల క్రితం విడుదలైన ‘బొమ్మరిల్లు’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసింది. సిద్ధార్థ్, జెనీలియా జంటగా నటించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా భాస్కర్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా తరువాత డైరెక్టర్ పేరులో బొమ్మరిల్లు అనే పేరు యాడ్ అయి బొమ్మరిల్లు భాస్కర్ గా పిలవడం మొదలుపెట్టారు. అంతగా సంచలన విజయం సాధించింది ఈ సినిమా. అప్పట్లోనే ఈ సినిమాను చాలా భాషల్లో రీమేక్ చేశారు.

తమిళంలో జయం రవి హీరోగా నటిస్తే.. ఒరిజినల్ వెర్షన్ లో నటించిన జెనీలియానే హీరోయిన్ గా చేసింది. అలానే హిందీలో కూడా ఈ సినిమా రీమేక్ ను రూపొందించారు. నిర్మాత బోణీ కపూర్ ‘ఇట్స్ మై లైఫ్’ అనే పేరుతో రీమేక్ చేశారు. అనీష్ బజ్మీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హర్మేన్ బవేజా హీరోగా నటించగా.. జెనీలియానే హీరోయిన్ గా తీసుకున్నారు. ప్రకాష్ రాజ్ పాత్రలో నానా పటేకర్ నటించారు. క్రేజీ కాంబినేషన్ లో మొదలైన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే కొన్ని కారణాల వలన విడుదలకు నోచుకోలేదు.

కొంతకాలానికి ఈ సినిమా సంగతి అందరూ మర్చిపోయారు. నిర్మాత బోణీ కపూర్ కూడా ఈ సినిమా గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ సినిమా హీరో, హీరోయిన్లు లైమ్ లైట్ లో కూడా లేరు. ఇలాంటి సమయంలో ఈ సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఓటీటీల హవా పెరగడంతో ఇలా రిలీజ్ చేయకుండా ఉన్న సినిమాలను, సగం షూటింగ్ చేసిన సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఇదే తరహాలో ‘ఇట్స్ మై లైఫ్’ సినిమాను జీ5 లో విడుదల చేయనున్నారు. అలానే ముందుగా ఈ నెల 29న జీ సినిమాస్ ఛానెల్ లో ప్రీమియర్ వేయబోతున్నారు. దాదాపు పదమూడేళ్ల క్రితం రూపొందించిన ఈ సినిమాను ఇప్పుడు ప్రేక్షకులు పట్టించుకుంటారో లేదో చూడాలి!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus