జార్జ్ రెడ్డి’ 15 డేస్ కలెక్షన్స్..!

సందీప్ మాధవ్ హీరోగా జీవన్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ‘జార్జ్ రెడ్డి’ చిత్రం నవంబర్ 22న విడుదలయ్యి మొదటి రోజే మిక్స్డ్ టాక్ ని మూట కట్టుకుంది. ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. ‘మైక్ మూవీస్’ ‘సిల్లీ మాంక్స్ స్టూడియోస్’ ‘త్రీ లైన్ సినిమాస్’ నిర్మాణ సంస్థల పై అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించాడు. మొదటి రోజు ఈ చిత్రం టాక్ ను బట్టి చూస్తే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా అనే డౌట్ అందరిలోనూ ఏర్పడింది. అయితే మొదటి నుండీ ఈ చిత్రం పై ఉన్న క్రేజ్ కారణంగా బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ లిస్టు లో చేరింది.

ఇక ‘జార్జ్ రెడ్డి’ చిత్రానికి 3 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 15 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 3.08 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తానికి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ లిస్టు లో చేరింది. ‘అర్జున్ సురవరం’ చిత్రం రావడంతో ‘జార్జ్ రెడ్డి’ కలెక్షన్లకి బ్రేక్ పడినట్టు అయ్యింది. ఈ వీకెండ్ తో ఈ చిత్రం ఫుల్ రన్ ముగుస్తుందని చెప్పొచ్చు.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus